గంగూలీ కోచింగ్ ఇచ్చినా.. పృథ్వీ ఫెయిలయ్యాడు

గంగూలీ కోచింగ్ ఇచ్చినా.. పృథ్వీ ఫెయిలయ్యాడు

Updated On : April 29, 2019 / 7:59 AM IST

ఐపీఎల్ 2019 సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారునిగా వ్యవహరిస్తున్న గంగూలీ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. దాదాపు ప్లే ఆఫ్ రేసులో ఖాయం కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లకు సౌరవ్ గంగూలీ వ్యక్తిగతంగానూ సలహాలిస్తున్నాడు. ఈ మేర కొద్ది రోజుల ముందే శిఖర్ ధావన్‌కు సలహలిస్తూ ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఇప్పుడు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షాకు ప్రాక్టీస్ సమయంలో చాలా విలువైన సలహాలు ఇచ్చాడు. క్యాంప్‌లో బ్యాట్ పట్టుకునే తీరు.. శైలి గురించి చూపిస్తున్నట్లుగా ఉంది. ఆ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేసింది. దానిని పోస్టు చేస్తూ కింద ‘దాదా వంటి సలహాదారుడు ఉంటే, మీరు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అయితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు’ అని పోస్టు చేసింది. 

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ 12 మ్యాచ్‌లు ఆడి 8 గెలుపొందింది. 16పాయింట్లతో ప్లే ఆఫ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్‌లు ఉండగా కచ్చితంగా టాప్ 4లో నిలుస్తుందనడంలో సందేహమే లేదు. 2012 తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.