దాదాతోనే వెటకారాలా : గంగూలీ రాజకీయాల్లో చేరు

టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడట. ఇందులో నిజం ఎంతమాత్రమూ లేదు. కానీ, గంగూలీ వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తోందంటూ పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ విమర్శలు గుప్పించాడు.

దాదాతోనే వెటకారాలా : గంగూలీ రాజకీయాల్లో చేరు

Updated On : February 22, 2019 / 11:46 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడట. ఇందులో నిజం ఎంతమాత్రమూ లేదు. కానీ, గంగూలీ వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తోందంటూ పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ విమర్శలు గుప్పించాడు.

టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడట. ఇందులో నిజం ఎంతమాత్రమూ లేదు. కానీ, గంగూలీ వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తోందంటూ పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ విమర్శలు గుప్పించాడు. భారత్ చిన్న పిల్లల వైఖరి పాటిస్తుందని ఎద్దేవా చేశాడు.  గంగూలీ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడని, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఫ్రీ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించాడు. 

పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారతదేశమంతా కోపోద్రిక్తతతో నిండిపోయింది. ఈ మేర పాకిస్తాన్‌తో అన్ని రకాలుగా సంబంధాలు తెంచుకోవాలని భావించింది భారత్. ఈ క్రమంలో ఆ దేశానికి ఎగుమతులు, పాక్‌తో ఆడే మ్యాచ్‌లు అన్నీ నిలిపివేయాలని భావించింది. ఈ విషయమై ఐసీసీని సంప్రదించాలని భావించింది బీసీసీఐ. ప్రభుత్వం అనుమతిస్తే అడుగుతామని జాప్యం చేసిన బీసీసీఐ గురించి సౌరవ్ గంగూలీ ఇలా మాట్లాడాడు. 

పాకిస్తాన్‌తో ప్రపంచ కప్‌ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ సరైనదేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఆడనంత మాత్రాన ఏం నష్టం రాదంటూ పాకిస్తాన్‌తో మ్యాచ్‌ రద్దును ప్రస్తావించాడు. అలాగే ఒక్క క్రికెటే కాదు ఆటలకు సంబంధించి మరేదైనా ఒప్పందాలు ఉన్నా పాకిస్తాన్‌తో సంబంధాలు తెంచుకోవాలని సూచించాడు.