అయోధ్యలో రాములవారిని దర్శించుకున్న కేశవ్ మహారాజ్
Keshav Maharaj: కేశవ్ మహారాజ్ రామభక్తుడని అందరికీ తెలిసిందే. అతడు మైదానంలో దిగినప్పుల్లా రామ్ సియా రామ్ పాటను ప్లే చేస్తుంటారు.

Keshav Maharaj: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆడడానికి ముందు దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తన కోరికను నెరవేర్చుకున్నాడు. తన ఇష్ట దైవమైన శ్రీరాముల వారిని అయోధ్యలో దర్శించుకున్నాడు. అయోధ్య రామమందిరానికి వెళ్లి రాముల వారిని దర్శించుకున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అయోధ్య ఆలయంలో రాముల వారికి నమస్కరిస్తున్న ఫొటో షేర్ చేశాడు. జై శ్రీరామ్.. అందరికీ దీవెనలు అంటూ క్యాప్షన్ పెట్టాడు.
కేశవ్ మహారాజ్ రామభక్తుడని అందరికీ తెలిసిందే. అతడు మైదానంలో దిగినప్పుల్లా రామ్ సియా రామ్ పాటను ప్లే చేస్తుంటారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలని అనుకున్నా అప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడు తన కోరికను నెరవేర్చుకున్నాడు. రాములవారి ఆశీర్వాదాలు తనకు ఎప్పుడూ ఉంటాయని అతడు ప్రగాఢంగా నమ్ముతాడు. ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకచ్‌లో రాణించాలని అతడు భావిస్తున్నాడు. కేశవ్ మహారాజ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందినవారు. కథక్ నర్తకి లెరిషా మున్సామిని 2022లో అతడు పెళ్లాడాడు.
కాగా, IPL 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున కేశవ్ మహారాజ్ ఆడుతున్నాడు. ఇప్పటికే అతడు ట్రైనింగ్ క్యాంపులో చేరాడు. ఈ నెల 24న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తన ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది.
Also Read: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే సంచలనం.. ధోని కెప్టెన్సీ ఎందుకు వదులుకున్నాడు?