Rafael Nadal Becomes Father: తండ్రి అయిన రఫేల్ నాదల్.. మగ బిడ్డకు జన్మనిచ్చిన భార్య మేరీ పరేల్లో
టెన్నిస్ సూపర్‌స్టార్ రఫేల్ నాదల్ తండ్రి అయ్యాడు. అతని భార్య మేరీ పెరెల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. నాదల్ దంపతులు నివశించే మాలోర్కా దీవిలోని ఒక ఆస్పత్రిలో మెరీ డెలివరీ జరిగినట్లు సమాచారం.

Rafael Nadal
Rafael Nadal Becomes Father: టెన్నిస్ సూపర్‌స్టార్ రఫేల్ నాదల్ తండ్రి అయ్యాడు. అతని భార్య మేరీ పెరెల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. నాదల్ దంపతులు నివశించే మాలోర్కా దీవిలోని ఒక ఆస్పత్రిలో మెరీ డెలివరీ జరిగినట్లు సమాచారం. వీళ్లిద్దరూ చాలా కాలం డేటింగ్ తర్వాత 2019లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే గత ఏడాది జులైలో నాదల్ తన భార్య ఎదురుచూస్తోందని, త్వరలో మేము తల్లిదండ్రులం కాబోతున్నట్లు వెల్లడించాడు.
స్పెయిన్ ఫుట్‌బాల్ క్లబ్ వారు ట్వీట్ ద్వారా నాదల్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని వెల్లడించారు. మా ప్రియమైన గౌరవ సభ్యుడు రఫేల్ నాదల్ సతీమణి మేరీ పెరెల్లో మొదటి బిడ్డకు జన్మనివ్వడం అభినందనలు. ఈ క్షణం యొక్క ఆనందాన్ని పంచుకోవడంలో మేము మీతో కలుస్తాము. ఆల్ ది బెస్ట్! అంటూ పేర్కొన్నారు. నాదల్ వయస్సు 36 సంవత్సరాలు.
Congratulations to our dear honorary member @RafaelNadal and to María Perelló for the birth of their first child. We join you in sharing the happiness of this moment. All the best!
— Real Madrid C.F. ???? (@realmadriden) October 8, 2022
ప్రస్తుతం 22 గ్రాండ్ స్లామ్‌లను కలిగి ఉన్నాడు, క్రీడా చరిత్రలో అత్యుత్తమ టెన్నిస్ ఆటగాడు. ప్రస్తుతం ATP ర్యాంకింగ్స్‌లో 2వ స్థానంలో ఉన్నాడు. ఇటీవలే తన స్నేహితుడు, తోటి టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ ఆట నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న సమయంలో నాదల్ కంటనీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.