KKR Vs SRH.. KKR టార్గెట్ 182 పరుగులు
కోల్ కతా: ఐపీఎల్ 2019 సీజన్ 12లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల

కోల్ కతా: ఐపీఎల్ 2019 సీజన్ 12లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల
కోల్ కతా: ఐపీఎల్ 2019 సీజన్ 12లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 182 పరుగుల టార్గెట్ ఉంచింది. హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 53 బంతుల్లో 85 పరుగులు చేశాడు. వార్నర్ ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ పూర్తి కాకుండానే వార్నర్ ఔటయ్యాడు. రసెల్ వేసిన 15.6 వ బంతిని కవర్స్ వైపు ఆడాడు. ఫీల్డర్ ఉతప్ప గాల్లోకి డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
విజయ్ శంకర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. శంకర్ ఇన్నింగ్స్ లో 2 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. మనీశ్ పాండే (8 పరుగులు) అతడికి సహకారం ఇచ్చాడు. కోల్ కతా బౌలర్లలో రసెల్ 2 వికెట్లు, పియూష్ చావ్లా ఒక వికెట్ తీశారు. టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది.
హైదరాబాద్ బ్యాటింగ్ : వార్నర్ (53 బంతుల్లో 85 పరుగులు), బెయిర్ స్టో (35 బంతుల్లో 39 పరుగులు), శంకర్ (24 బంతుల్లో 40 పరుగులు), యూసుఫ్ పఠాన్(4 బంతుల్లో 1 పరుగు), మనీష్ పాండే (5 బంతుల్లో 8 పరుగులు).