ఫేక్ న్యూస్ అని చెప్పండి : సురేష్ రైనా చనిపోయాడంటూ ప్రచారం

సోషల్ మీడియా వేదికగా ఏ వార్త అయినా నిజమెంత ఉందో తెలియకుండానే ఫార్వార్డ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇలా పూర్తి సమాచారం లేకుండా చేసే మెసేజ్‌ల ద్వారా విలువ లేని సమాచారం కూడా వైరల్‌గా మారిపోతుంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఇటీవల రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయాడంటూ రూమర్లు వచ్చాయి.
ఇలా తనను సోషల్ మీడియా వేదికగా చంపేయడం పట్ల సురేశ్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటువంటి వార్తలు తన కుటుంబ సభ్యులు, సహచరులను తీవ్రమైన మనోవేదనకు గురి చేశాయన్నారు. ఎన్ని రూమర్లు వచ్చినప్పటికీ ఈ విషయం పట్ల నిర్ధారణ కోసం సురేశ్ రైనా అధికారిక ట్విట్టర్ ఖాతాను పలుమార్లు సందర్శించారట. వీటన్నిటికీ సమాధానం చెప్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఇదంతా రూమర్ల ఎఫెక్ట్ అని కొట్టిపారేశారు.
మార్చి 23 నుంచి జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఖరిసారిగా జులై నెలలో ఇంగ్లాండ్ పర్యటన చేసిన టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ జట్టులోకి అరంగ్రేటం చేసిన రైనా.. ఇప్పటివరకూ 226వన్డేలు, 87 టీ20లు, 18టెస్టులు ఆడాడు.
Past few days there has been fake news of me being hurt in a car accident.The hoax has my family & friends deeply disturbed. Please ignore any such news; with god’s grace I’m doing absolutely fine.Those @youtube channels have been reported & hope strict actions will be taken soon
— Suresh Raina?? (@ImRaina) February 11, 2019
Also Read: రికార్డుల వేట : కొత్త చరిత్రకు దగ్గరలో ధోనీ
Also Read: కోహ్లీ కావాలని ఎవరినీ కించపరచలేదు: పూజారా
Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు