Suryakumar Yadav : 30 సెకన్లలో 3 రోజులు.. దేవీషాతో సూర్య‌కుమార్ యాద‌వ్‌

టీమ్ ఇండియా స్టార్ బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) ఒక‌డు. టీ20 క్రికెట్‌లో దంచికొట్టే ఈ ఆట‌గాడు ఎందుక‌నో వ‌న్డేల్లో, టెస్టుల్లో త‌నదైన ముద్ర వేయ‌లేక‌పోతున్నాడు.

Suryakumar Yadav : 30 సెకన్లలో 3 రోజులు.. దేవీషాతో సూర్య‌కుమార్ యాద‌వ్‌

Suryakumar Yadav-Devisha

Updated On : June 17, 2023 / 7:13 PM IST

Suryakumar Yadav-Devisha : టీమ్ ఇండియా స్టార్ బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) ఒక‌డు. టీ20 క్రికెట్‌లో దంచికొట్టే ఈ ఆట‌గాడు ఎందుక‌నో వ‌న్డేల్లో, టెస్టుల్లో త‌నదైన ముద్ర వేయ‌లేక‌పోతున్నాడు. ఇటీవ‌ల ముగిసిన ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్(WTC Final) మ్యాచ్‌కు స్టాండ్ బై ఆట‌గాడిగా ఎంపికైనా తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశం రాలేదు. ఐపీఎల్‌(IPL), డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ముగియ‌డంతో ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు.

త‌న భార్య దేవిషాతో కలిసి మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలోని ఐబిజా దీవులకు వెళ్లాడు. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వీడియోను దేవిషా త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. 30 సెకన్లలో 3 రోజులు అంటూ ఈ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. విమానంలో ఉన్న ఫోటోలు, బ‌స చేసిన హోట‌ల్ గ‌ది, పుడ్‌, స‌ముద్ర తీర‌పు అందాలు వంటి ఫోటోల‌ను వీడియోగా పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Asia Cup 2023 : వ‌ర‌ల్డ్ క‌ప్ త‌రువాత‌.. ముందు ఆసియా క‌ప్‌ను కొట్టండి.. ప్రొమో అదిరిపోయింది

 

View this post on Instagram

 

A post shared by Devisha Suryakumar Yadav (@devishashetty_)

సూర్యకుమార్ యాదవ్, దేవిషా కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నారు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన అనంత‌రం మే 29, 2016న వివాహం బంధంతో ఒక్క‌టి అయ్యారు. దేవీషా త‌న‌కు చాలా స‌పోర్ట్ ఇచ్చింద‌ని, త‌న కెరీర్ ను తీర్చిదిద్దుకోవ‌డంలో ఆమె కృషి చాలా ఉన్న‌ట్లు సూర్య‌కుమార్ యాద‌వ్ ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో దేవీషా స్టాండ్స్‌లో నిల‌బ‌డి సూర్య‌కుమార్ ను ఉత్సాహ‌ప‌రుస్తుంది.

BAN vs AFG : టెస్టు క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. 21వ శ‌తాబ్దంలో అతి పెద్ద విజ‌యం

సూర్య‌కుమార్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున 48 టీ20లు, 23 వ‌న్డేలు, ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. టీ20ల్లో 1,675 ప‌రుగులు వ‌న్డేల్లో 433, టెస్టుల్లో 8 ప‌రుగులు చేశాడు. టీ 20 క్రికెట్‌లో మూడు శ‌త‌కాలు బాదాడు. ఇక ఐపీఎల్‌లో 139 మ్యాచులు ఆడిన సూర్య‌కుమార్ 143.3 స్ట్రైక్‌రేటుతో 3,249 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోరు 112. ఇక రానున్న వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో స‌త్తా చాటాల‌ని సూర్య‌కుమార్ బావిస్తున్నాడు.