T20 World Cup 2021 : వెస్టిండీస్ పై శ్రీలంక విజయం
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ పై శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన భారీ టార్గెట్ ను విండీస్ చేజ్

T20 World Cup 2021 Sri Lanka Beats West Indies
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ పై శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన భారీ టార్గెట్ ను విండీస్ చేజ్ చేయలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ వూరన్ 46 పరుగులు చేయగా, హెట్ మెయిర్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 81 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, చమిక కరుణరత్నే, హసరంగ తలో రెండు వికెట్లు తీశారు. చమీరా, శనక చెరో వికెట్ తీశారు.
Smokers Food : సిగరెట్ తాగే వారు ఈ ఆహారం తింటే ఊపిరితిత్తులు సేఫ్…
టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కు ఆ నిర్ణయం బెడిసికొట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక… భారీ స్కోరు నమోదు చేసింది. టాపార్డర్ వీరవిహారం చేసిన ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు సాధించింది.
అసలంక 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 68 పరుగులు చేయగా…. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 41 బంతుల్లో 5 ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరెరా 29, కెప్టెన్ దసున్ షనక 14 బంతుల్లో 25 పరుగులు చేశారు.
Heart Attack : అకస్మాత్తుగా గుండెపోటు ఎందుకు వస్తుందంటే?..
ఇక లక్ష్యఛేదనలో వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. లంక బౌలర్ బినుర ఫెర్నాండో అద్భుతమైన స్పెల్ తో క్రిస్ గేల్ (1), ఎవిన్ లూయిస్ (8)లను పెవిలియన్ కు పంపాడు. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక ఈ మ్యాచ్ లో గెలిచి వెస్టిండీస్ సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది.