T20 World Cup 2022: పాకిస్థాన్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ లో ఇటు భారత్, అటు పాక్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. పాకిస్థాన్ బౌలింగ్ పటిష్ఠంగా ఉంది. భారత్-పాక్ మధ్య చివరిసారిగా ఆసియా కప్ లో మ్యాచ్ జరిగింది.

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ లో ఇటు భారత్, అటు పాక్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. పాకిస్థాన్ బౌలింగ్ పటిష్ఠంగా ఉంది. భారత్-పాక్ మధ్య చివరిసారిగా ఆసియా కప్ లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుండడంతో అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షీప్ సింగ్, షమీ.
పాకిస్థాన్ జట్టు: బాబర్ అజాం, రిజ్వాన్, మసూద్, అహ్మద్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిదీ, నసీమ్ షా, హరీస్ రౌఫ్.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..