Gambhir : రోహిత్, కోహ్లీ గురించి గంభీర్ కీలక కామెంట్స్.. పదేపదే బ్యాటింగ్ లైనప్ మార్పుపై ఏమన్నాడంటే.. తగ్గేదే లేదు..!
Gambhir : దక్షిణాఫ్రికా జట్టుపై వన్డే సిరీస్ విజయం తరువాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై కీలక కామెంట్స్ చేశారు.
Gautam Gambhi
Gambhir : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సిరీస్ విజయంలో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కీలక భూమిక పోషించారు. ఇద్దరు ప్లేయర్లు పరుగుల వరద పారించడంతో టీమిండియా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అయితే, ఇన్నాళ్లు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. రోహిత్, కోహ్లీలను వన్డే మ్యాచ్‌లకు పూర్తిస్థాయిలో పక్కన పెట్టాలని ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ నడిచింది. అయితే, తాజాగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో ఇద్దరు సీనియర్ ప్లేయర్లు అద్భతంగా రాణించడంతో గంభీర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే విషయంపై తాజాగా గంభీర్ స్పందిస్తూ రోహిత్, కోహ్లీలపై కీలక కామెంట్స్ చేశాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ విజయంలో కోహ్లీ, రోహిత్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నాణ్యమైన ఆటగాళ్లు. ప్రపంచ స్థాయి బ్యాటర్లు, ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పా.. అలాంటి ప్లేయర్లు 50ఓవర్ల ఫార్మాట్లో జట్టుకు ఎంతో అవసరం సుదీర్ఘకాలంగా వాళ్లిద్దరూ సత్తా చాటుతున్నారు. ఇదే స్థిరత్వాన్ని మున్ముందు కొనసాగించాలని కోరుకుంటున్నా.. డ్రెస్సింగ్ రూమ్ కు ఇది ఎంతో మేలు చేస్తుంది అని గంభీర్ అన్నారు.
మరోవైపు.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పులు చేస్తుండం పట్ల గంభీర్ పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనా గంభీర్ తాజాగా స్పందించారు. స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం లేదని గంభీర్ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకే రకమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఓపెనింగ్ జోడీ మాత్రమే ఇందుకు మినహాయింపు. అయితే, టెస్టులకు మాత్రమే స్థిరంగా ఒకే బ్యాటింగ్ లైనప్ ఉండాలి అంటూ గంభీర్ వ్యాఖ్యానించారు.
