Team India : టీమ్ఇండియా హోమ్ సీజన్ షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ.. మొత్తం 22 మ్యాచ్‌లు..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమ్ఇండియా (Team India) 2026-27 సీజన్‌కు సంబంధించిన హోమ్ షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది.
Team India international home season 2026 and 2027 schedule released by bcci
Team India : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ఇండియా 2026-27 సీజన్‌కు సంబంధించిన హోమ్ షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. మొత్తంగా 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 9 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్టులు ఉన్నాయి.
సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో పర్యటనతో భారత హోం సీజన్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డేలకు త్రివేండ్రం, గౌహతి, న్యూ ఛండీగడ్‌లు, టీ20లకు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్‌లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Presenting the fixtures for #TeamIndia‘s (Senior Men) international home season 2026-27 🗓️ 👉
It all begins with the limited-overs series against West Indies in September 2026 👌 pic.twitter.com/7qCnMiShvB
— BCCI (@BCCI) March 26, 2026
డిసెంబర్లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. వన్డేలకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ లు టీ20లకు రాజ్‌కోట్, కటక్, పూణేలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వేతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఆ తరువాత ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.
భారత్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్ ఇదే..

భారత్ వర్సెస్ శ్రీలంక షెడ్యూల్ ఇదే..
భారత్ వర్సెస్ జింబాబ్వే షెడ్యూల్ ఇదే..

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా షెడ్యూల్ ఇదే..


