Ind vs Ban 2nd test: ప్రాక్టీస్ సెషన్‌లో చెమటోడ్చుతున్న టీమిండియా
ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ పాల్గొన్నారు.

బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టులో గెలుపొందిన టీమిండియా రెండో టెస్టు మ్యాచు కోసం సన్నద్ధమవుతోంది. కాన్పూర్‌లో టీమిండియా ప్రాక్టీసు చేస్తోన్న వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రెండు మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో శుక్రవారం నుంచి టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచు జరగనుంది.
ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ పాల్గొన్నారు. అలాగే, వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, పేసర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా పాల్గొన్నారు.
మొదటి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 376, రెండో ఇన్నింగ్స్‌లో 287/డిక్లేర్ పరుగులు చేయగా, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149, రెండో ఇన్నింగ్స్‌లో 234 రన్స్ మాత్రమే చేసింది.
రవిచంద్రన్ అశ్విన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 27న కాన్పూర్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టులో జట్టులో మార్పులు చేయకూడదని భారత జట్టు నిర్ణయించింది.
రెండో టెస్టుకు భారత స్క్వాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్
📍 Kanpur#TeamIndia hit the ground running ahead of the 2nd #INDvBAN Test 🙌@IDFCFIRSTBank pic.twitter.com/EMPiOa8HII
— BCCI (@BCCI) September 26, 2024
IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న 6 రికార్డులు.. ఏంటో తెలుసా?