IND vs AUS : రాణించిన స్టీవ్ స్మిత్‌, అలెక్స్ కేరీ.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే..?

భార‌త్‌తో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆలౌటైంది.

IND vs AUS : రాణించిన స్టీవ్ స్మిత్‌, అలెక్స్ కేరీ.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే..?

PIC credit @ BCCI TWITTER

Updated On : March 4, 2025 / 6:06 PM IST

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు రాణించారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73; 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అలెక్స్ కేరీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించగా 49.3 ఓవ‌ర్ల‌లో 264 ప‌రుగులకు ఆస్ట్రేలియా ఆలౌటైంది.

ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ (39), మార్న‌స్ ల‌బుషేన్ (29)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. జోస్ ఇంగ్లిష్ (11), గ్లెన్ మాక్స్‌వెల్ (11)లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ మూడు వికెట్లు తీశాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ర‌వీంద్ర జ‌డేజా చెరో రెండు వికెట్లు తీశారు. అక్ష‌ర్ ప‌టేల్, హార్దిక్ పాండ్యా త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

IND vs AUS : గిల్ ‘క్లీన్ క్యాచ్’ వివాదం.. నిబంధ‌న‌లు ఏమీ చెబుతున్నాయి.. క్యాచ్‌ను ప‌ట్టుకున్న ఆట‌గాడు ఎంత‌సేపు బంతిని చేతిలో ఉంచుకోవాలి?

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఆరంభంలోనే ష‌మీ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లో కేఎల్ రాహుల్ చ‌క్క‌ని క్యాచ్ అందుకోవ‌డంతో ఓపెన‌ర్ కూపర్ కొన్నోలీ డ‌కౌట్ అయ్యాడు. అయితే.. మ‌రో ఎండ్‌లో వ‌న్ డౌన్‌లో వ‌చ్చిన స్మిత్‌తో క‌లిసి ట్రావిస్ హెడ్ భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండ‌రీలు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. అయితే.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌న తొలి ఓవ‌ర్‌నే హెడ్‌ను ఔట్ చేశాడు. రెండో వికెట్‌కు హెడ్‌-స్మిత్‌లు 50 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

ఆరంభంలో క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బంది ప‌డిన స్మిత్.. కుదురుకున్నాక త‌న‌దైన శైలిలో ఆడుతూ ప‌రుగులు సాధించాడు. ఈ క్ర‌మంలో అత‌డు ల‌బుషేన్‌తో మూడో వికెట్‌కు 56 ప‌రుగులు, జోష్ ఇంగ్లిష్‌తో క‌లిసి నాలుగో వికెట్‌కు 34 ప‌రుగులు జోడించాడు. ఈ ద‌శ‌తో స్మిత్‌కు అలెక్స్ కేరీ జ‌త‌క‌లిశాడు. వీరిద్ద‌రు భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో స్మిత్ 68 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. శ‌త‌కం దిశ‌గా వెలుతున్న అత‌న్ని ష‌మీ క్లీన్ బౌల్డ్ చేశాడు.

Champions Trophy Prize Money : న‌క్క‌తోక తొక్కిన బంగ్లా, పాక్‌, ఇంగ్లాండ్‌.. ఒక్క మ్యాచ్‌లో గెల‌వ‌క‌పోయినా కోట్ల‌లో ప్రైజ్‌మ‌నీ.. ఇదేం విడ్డూరం సామీ..

స్మిత్-కేరీ జోడి ఐదో వికెట్‌కు 54 ప‌రుగులు జ‌త చేశారు. స్మిత్ ఔటైన త‌రువాత అలెక్స్ కేరీ ధాటిగా బ్యాటింగ్ కొన‌సాగించాడు. హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న అత‌డిని ఇన్నింగ్స్ చివ‌రిలో అక్ష‌ర్ ప‌టేల్ ర‌నౌట్ చేశాడు. ఎనిమిదో వికెట్ గా కేరీ వెనుదిర‌గ‌గా.. ఆపై ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్ట‌లేదు.