సిరీస్ కొట్టేశారు: 35 పరుగుల తేడాతో కివీస్‌ను మట్టికరిపించిన భారత్

సిరీస్ కొట్టేశారు: 35 పరుగుల తేడాతో కివీస్‌ను మట్టికరిపించిన భారత్

Updated On : June 22, 2021 / 1:28 PM IST

వరుస విజయాలకు బ్రేక్ వేసిన న్యూజిలాండ్‌కు ధీటుగా సమాధానమిచ్చింది టీమిండియా. ఐదు వన్డేల ఫార్మాట్‌ను మూడు వన్డేలతో దక్కించేసుకున్న భారత్..  చివరి వన్డే సైతం విజయంతో ముగించింది. పర్యటనలో తొలి ఫార్మాట్‌ను విజయంతో ఆరంభించింది భారత్. సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్‌కు చేదు అనుభవం తప్పదని భావించారంతా. అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ దూకుడైన ఆటతీరును కనబరచింది టీమిండియా.

ఐదో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 252 పరుగులు చేసి కివీస్ ముంగిట చక్కటి టార్గెట్ ఉంచింది. చేధనలో విఫలమైన కివీస్ 44.1ఓవర్లలోనే ఆలౌట్‌కు గురై పరాజయానికి గురైంది. ఒకానొక దశలో నాలుగో వన్డేలో చేసిన 92పరుగుల స్కోరైనా చేయగలదా అని భావించారంతా. అటువంటి పరిస్థితుల్లో టాపార్డర్ బ్యాట్స్‌మన్ విఫలమైనా స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ భారత్‌కు చక్కటి స్కోరు అందించాడు అంబటి రాయుడు. 113 బంతులు ఆడి 90 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా వరుస సిక్సులతో చెలరేగాడు. మొత్తంగా 22 బంతుల్లో 45పరుగులు బాదాడు.

కెప్టెన్ విలియమ్సన్‌తో సహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. జేమ్స్ నీషమ్(44), కేన్ విలియమ్సన్(39), టామ్ లాథమ్(37)ల స్కోరు మాత్రమే జట్టుకు హైలెట్.

కీలక సమయంలో జట్టును ఆదుకుని పటిష్టమైన స్థితిలో నిలిపిన అంబటి రాయుడు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’  సొంతం చేసుకున్నాడు.