Tilak Varma: టీ20 తొలి ఫిఫ్టీ వేడుక రోహిత్ భాయ్ కుమార్తె కోసమన్న తిలక్ వర్మ.. ఎందుకో తెలుసా? వీడియో వైరల్
తిలక్ వర్మ టీ20ల్లో తన మొదటి అర్థ సెంచరీ వేడుకను రోహిత్ శర్మ కుమార్తె సమైరాకు అంకితం ఇచ్చేశాడు. తద్వారా సమైరాతో తనకున్న సన్నిహిత బంధాన్ని చాటుకున్నాడు.

Rohit Sharma Daughter Samaira
Rohit Sharma Daughter Samaira: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ టీ20ల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమ చేతి బ్యాటర్ రెండు మ్యాచ్‌లలోనూ ఆకట్టుకున్నాడు. ఆదివారం తాను ఆడిన రెండో మ్యాచ్‌లో ఆఫ్ సెంచరీ చేశాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అయితే, భారత్ జట్టు రెండో మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది.
తిలక్ వర్మ టీ20ల్లో తన మొదటి అర్థ సెంచరీ వేడుకను రోహిత్ శర్మ కుమార్తె సమైరాకు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. తద్వారా సమైరాతో అతనికున్న సన్నిహిత బంధాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మ్యాచ్ అనంతరం వర్మ మాట్లాడుతూ.. నేను సమైరాను స్వామీ అని పిలుస్తాను. నేను తొలి సెంచరీ, తొలి అర్థ సెంచరీ సాధించినప్పుడు ఆ అద్భుత వేడుకను సమైరాకు అంకితం చేస్తానని వాగ్దానం చేశానని రోహిత్ కుమార్తెతో తన ప్రత్యేక బంధాన్ని తిలక్ వర్మ గుర్తు చేసుకున్నాడు.
IND VS WI 2nd T20 : ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం.. వరుసగా రెండు టీ20ల్లో గెలుపు
సమైరాకు ఇచ్చిన మాట ప్రకారం.. టీ20ల్లో తన తొలి అర్ధ సెంచరీ వేడుకను సమైరాకు అంకితం ఇచ్చానని తిలక్ వర్మ చెప్పారు. ‘ఇది రోహిత్ బాయ్ కుమార్తె స్వామీ (సమైరా)కి. నేను స్వామీకి చాలా సన్నిహితుడిని. నేను సెంచరీ, చేసినా, ఫిఫ్టీ చేసినా ఆ వేడుకను ఆమెకు అంకితం చేస్తానని వాగ్దానం చేశాను’ అని వర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ చెప్పాడు.
A special fifty ?
A special celebration for someone special from the Rohit Sharma family ☺️#TeamIndia | #WIvIND | @ImRo45 | @TilakV9 pic.twitter.com/G7knVbziNI
— BCCI (@BCCI) August 6, 2023