కివీస్‌తో ఓటమిపై కోహ్లీ.. టాస్ మా కొంపముంచింది

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టును 10వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. టాస్ గెలుచుకోలేకపోవడం చాలా కీలకమైందని.. ఓటమికి అదొక కారణమని పోటీ ఇవ్వలేకపోయినట్లు చెప్పాడు.
‘తొలి రోజు టాస్ అనుకూలంగా పడటమనేది చాలా ముఖ్యం. బ్యాటింగ్ విభాగం ఎంత కష్టపడినప్పటికీ తగినంత పోటీ ఇవ్వలేకపోయాం. కివీస్ బౌలర్లను ఒత్తడిలోకి నెట్టామని మేం అనుకోవడం లేదు. 220-230కు మించిన స్కోరు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మొదటి ఇన్నింగ్సే వెనక్కిపడేలా చేసి ఒత్తిడిలోకి నెట్టేసింది’
See Also>>కోహ్లీ.. సచిన్.. ధోనీ చదివిందేంటో తెలుసా.. డిగ్రీ కూడా పాసవ్వని వాళ్లెవరంటే
‘బౌలింగ్ విభాగంగా చాలా పోటీని ఎదుర్కొన్నాం. 7వికెట్లు పడేవరకూ బాగా ఆడాం. చివరి 3వికెట్లు మమ్మల్ని బాగా దెబ్బతీశాయి. ఆ 120పరుగులే జట్టుకు గెలుపును దూరం చేశాయి. మయాంక్.. అజింకా రహానె మాత్రమే ఓ టెంపోలో ఆడుతున్నారు. పృథ్వీ షా విదేశీ గడ్డపై రెండు గేమ్‌లు మాత్రమే ఆడినా పరవాలేదనిపించాడు. ఓ బ్యాటింగ్ యూనిట్‌గానే మిగిలిపోయాం కానీ, ఆల్ రౌండర్ ప్రదర్శన ఇవ్వలేకపోయాం’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. మూడో రోజు ఆట ముగిసే సరికి 65 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసిన భారత్.. నాల్గో రోజు బ్యాటింగ్ కొనసాగించి రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది.. 58 పరుగులతో మయాంక్ అగర్వాల్, 29 పరుగులతో రహానే, 25 పరుగులతో పంత్ పర్వాలేదనిపించినా.. మిగతా ఆటగాళ్లు కనీస ఆటతీరును కనబర్చలేకపోవడంతో.. 191 పరుగులతోనే సరిపెట్టుకుంది టీమిండియా. కివీస్ బౌలర్లలో సౌథీ 5/61, బౌల్ట్ 4/39తో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.. 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు… ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్ని సాధించింది.
Read More>>న్యూట్రీ గార్డెన్స్: మహిళల్లో ఆరోగ్య సమస్యలకు చెక్!