Cricketer : రషీద్ ఖాన్ కుటుంబంలో విషాదం

అఫ్గానిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అతడి కజిన్ హమీద్‌ఖాన్ కన్ను మూసినట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రషీద్

Cricketer : రషీద్ ఖాన్ కుటుంబంలో విషాదం

Cricketer

Updated On : January 2, 2022 / 11:58 AM IST

Cricketer :  అఫ్గానిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అతడి కజిన్ హమీద్‌ఖాన్ కన్ను మూసినట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రషీద్. ‘నా కజిన్ హమీద్ ఖాన్ ఇక లేరు, అతడి ఆత్మకు శాంతి చేరురాలని కోరుకుంటున్నాను” అంటూ రషీద్ ట్వీట్ చేశారు. కాగా రషీద్ ప్రస్తుతం బిగ్‌ బాష్‌ లీగ్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్నాడు.

చదవండి : Cricket 2021: ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో టాప్-5 బ్యాట్స్‌మెన్లు వీరే!

రషీద్ ఐపీఎల్ సన్‌రైజర్స్‌ తరపున ఆడాడు. అయితే 2021లో సన్‌రైజర్స్‌ జట్టు అతడిని రీటైన్ చేసుకోలేదు. అయితే ఈ ఏడాది జరిగే మెగవేలంలో రషీద్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐపీఎల్ వేలం జరగనున్నట్లు సమాచారం.

చదవండి : Indian Origin Cricketers: ఇండియాలో పుట్టి విదేశాలకు ఆడుతున్న ఏడుగురు క్రికెటర్లు