Under 19 Womens T20 WC : మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ప్రకటన.. ముగ్గురు తెలుగు అమ్మాయిలకు చోటు..
మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జనవరి 18 నుంచి మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

U19 Womens T20 World Cup 2025 Niki Prasad to lead Team India
మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జనవరి 18 నుంచి మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్‌గా వ్యహరించనుండగా సానికా చల్కే వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
15 మంది సభ్యులు గల బృందంలో ముగ్గురు తెలుగు అమ్మాయిలకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు విశాఖపట్నంకు చెందిన షబ్నమ్‌లు.
మహిళల అండర్-19 ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. నాలుగేసి జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూపులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. 12 జట్లు సూపర్ సిక్స్‌కు చేరుకోగా వాటిని రెండు గ్రూపులు విభజిస్తారు. రెండు గ్రూపుల్లో టాప్ 2గా నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి.
జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు టోర్నీ జరగనుంది.
Viral Video : అరుదైన ఘటన.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. బౌలర్ చేతికి గాయం..
మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఇదే..
నిక్కీ ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే (వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, కమలిని జి(వికెట్ కీపర్), భవికా అహిరే (వికెట్ కీపర్), ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషిత వీజే, సోనమ్ యాదవ్, పర్ణికా సిసోడియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, ఆనందితా కిషోర్, షబ్నమ్, వైష్ణవి ఎస్.