IPL 2025: తన మొట్టమొదటి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ కామెంట్స్.. ఈ చిన్నోడు ఏమన్నాడంటే?
ఆ రిజల్ట్స్ ఇప్పుడు కనపడుతున్నాయని వైభవ్ అన్నాడు.

PIC: @IPL (X)
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ పై సోమవారం జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ధనాధన్ అతడు కొట్టిన షాట్లకు స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఐపీఎల్‌తో పాటు టీ20ల్లో సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ వైభవ్‌దే.
తన సెంచరీ గురించి మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. ఈ సెంచరీ చేయడం తనకెంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని అన్నాడు. ఐపీఎల్‌లో ఇది తనకు ఫస్ట్ సెంచరీ అని, మూడవ ఇన్నింగ్స్ అని చెప్పాడు.
Also Read: కేసీఆర్ ఆ పేరు పలకొద్దని అనుకుంటున్నారా..?
ఐపీఎల్‌కు ముందు చాలా సాధన చేశానని, దీంతో ఆ రిజల్ట్స్ ఇప్పుడు కనపడుతున్నాయని వైభవ్ అన్నాడు. తాను క్రీజులో ఉన్నప్పుడు బంతిని మాత్రమే చేస్తానని, బాల్ పడగానే షాట్ కొడతానని తెలిపాడు.
ఈ మ్యాచులో జైశ్వాల్‌తో కలిసి క్రీజులో బ్యాటింగ్ చేశానని, తాను ఏమి చేయాలన్న విషయాన్ని అతడు చెబుతాడని అన్నాడు. తనలో పాజిటివిటీని నింపుతాడని తెలిపాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేయడం తన కల అని తెలిపాడు. ఇప్పుడది నెరవేరిందని అన్నాడు. తాను పూర్తిగా గేమ్‌పైనే దృష్టి పెడతానని తెలిపాడు.
కాగా, గుజరాత్ టైటాన్స్ ఇచ్చిన 210 పరుగుల టార్గెట్‌ను రాజస్థాన్ చాలా సులభంగా ఛేదించింది. 8 వికెట్ల తేడాతో గెలిచింది. వైభవ్ సూర్యవంశీ బాదిన బాదుడే ఇందుకు కారణం. అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.