Viral Video: బడి వద్ద మైదానంలో అద్భుత రీతిలో సిక్సర్లు కొట్టిన బాలిక.. సచిన్, జైషా ప్రశంసలు

బడి వద్ద మైదానంలో ఓ బాలిక అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తూ సిక్సర్లు బాదింది. ప్రొఫెషనల్ క్రికెటర్ లా ఆమె కొట్టిన షాట్లు అందరినీ ఆశ్చర్యపర్చుతున్నాయి. దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్యా బాత్ హై అంటూ దీనిపై స్పందించగా, బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా ఆ బాలికపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆమె వీడియోను పోస్ట్ చేశారు.

Viral Video: బడి వద్ద మైదానంలో అద్భుత రీతిలో సిక్సర్లు కొట్టిన బాలిక.. సచిన్, జైషా ప్రశంసలు

Updated On : February 14, 2023 / 9:26 PM IST

Viral Video: బడి వద్ద మైదానంలో ఓ బాలిక అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తూ సిక్సర్లు బాదింది. ప్రొఫెషనల్ క్రికెటర్ లా ఆమె కొట్టిన షాట్లు అందరినీ ఆశ్చర్యపర్చుతున్నాయి. దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్యా బాత్ హై అంటూ దీనిపై స్పందించగా, బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా ఆ బాలికపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆమె వీడియోను పోస్ట్ చేశారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ బాలికను చాలా మంది టీ20 సూపర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ తో పోల్చుతున్నారు. ఆమె కొడుతున్న షాట్లు సూర్యకుమార్ యాదవ్ కొట్టే షాట్లలాగే ఉన్నాయని అంటున్నారు.

“ఈ బాలికకు ఉన్న క్రికెట్ నైపుణ్యాలను చూసి, ఆమెను ఆ ఆట పట్ల ఉన్న ప్యాషన్ ను చూసి ఆశ్చర్యపోయాను. భారత మహిళల క్రికెట్ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉంది. యువ అథ్లెట్లకు ప్రోత్సాహం అందిద్దాం. వారు భవిష్యత్తు గేమ్ చేంజర్స్ అవుతారు” అని జై షా పేర్కొన్నారు. ఆ బాలిక బ్యాటింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశానని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు.

ఆ బాలిక పాఠశాల వద్ద బాలురతో క్రికెట్ ఆడుతుండగా, ఆమె కొడుతున్న షాట్లను ఒకరు వీడియో తీశారు. ఆమె ఎవరో గుర్తించి క్రికెట్ శిక్షణ ఇప్పించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్న వేళ ఈ బాలిక వీడియో బయటకు రావడం గమనార్హం.


#BorderGavaskarTrophy: శ్రేయాస్ వచ్చేస్తున్నాడు.. రెండో టెస్ట్ మ్యాచ్ స్వాడ్ లో అయ్యర్