Virat Kohli : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. అరుదైన రికార్డుపై కోహ్లీ క‌న్ను..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు

Virat Kohli : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. అరుదైన రికార్డుపై కోహ్లీ క‌న్ను..

Virat Kohli eyes special milestone IN BGT only 21 runs away

Updated On : November 20, 2024 / 10:56 AM IST

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో మ‌రో ఘ‌న‌త‌పై క‌న్నేశాడు. శుక్ర‌వారం పెర్త్ వేదిక‌గా ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ మ‌రో 21 ప‌రుగులు చేస్తే బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో 2000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన ఏడో బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు.

బోర్డర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 42 ఇన్నింగ్స్‌ల్లో 1979 ప‌రుగులు చేశాడు. ఇందులో 8 శ‌త‌కాలు, 5 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో 3262 ప‌రుగుల‌తో స‌చిన్ టెండూల్క‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత రికీ పాంటింగ్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌, రాహుల్ ద్ర‌విడ్‌లు ఉన్నారు.

Team India : పాపం స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌.. న‌వ్వు ఆపుకోలేక‌పోయిన కోహ్లీ.. కింద‌ప‌డి మ‌రీ న‌వ్విన రిష‌బ్ పంత్.. వీడియో

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు..

సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) – 3262 పరుగులు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 2555 పరుగులు
వీవీఎస్ లక్ష్మణ్ (భార‌త్‌) – 2434 పరుగులు
రాహుల్ ద్రావిడ్ (భార‌త్) – 2143 పరుగులు
మైఖేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా) – 2049 పరుగులు
చెతేశ్వర్ పుజారా (భార‌త్‌) – 2033 పరుగులు
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 1979 పరుగులు

ఆసీస్ గ‌డ్డ‌పై వ‌రుస‌గా రెండు సార్లు టీమ్ఇండియా బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ ట్రోఫీని ద‌క్కించుకోవాల‌ని ఆరాట‌ప‌డుతోంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్‌కు చేరుకోవాలంటే భార‌త్‌కు ఈ సిరీస్ ఎంతో ముఖ్యం. 4-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండానే భార‌త్ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు చేరుకుంటుంది.

Sachin Tendulkar : భార్య అంజ‌లి, కూతురు సారాతో క‌లిసి ఓటేసిన స‌చిన్ టెండూల్క‌ర్‌.. వీడియో