వాహ్.. విరాట్! ఒంటి చేత్తో కామెరూన్ పంపి.. జట్టులో జోష్ నింపాడు

వాహ్.. విరాట్! ఒంటి చేత్తో కామెరూన్ పంపి.. జట్టులో జోష్ నింపాడు

Updated On : December 18, 2020 / 7:31 PM IST

VIRAT KOHLI: టీమిండియా కెప్టెన్.. లీడింగ్ బ్యాట్స్‌మన్ VIRAT KOHLI బ్యాట్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ జట్టుకు జోష్ నింపాడు. కామెరూన్ గ్రీన్ ను బ్రిలియంట్ క్యాచ్ అందుకుని అవుట్ చేశాడు. అప్పటికే ఫీల్డింగ్ లో కాస్త డల్ గా అనిపించి రెండు క్యాచ్ లు వదులుకున్న టీమిండియాకు ఉత్సాహం రెట్టింపు అయింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో దాదాపు బౌండరీకి వెళ్లిపోతుందనుకున్న బంతిని గాల్లో ఉండి ఒంటిచేత్తో అందుకున్నాడు కోహ్లీ.

బ్యాటింగ్ కు తోడు బౌలింగ్ లోనూ మేటి అనిపించడంతో తొలి రోజు ముగిసేసరికి 62 పరుగుల ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. బుమ్రా రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్ మూడు రెండు వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియా ఆటగాళ్లు పెద్ద స్కోరు చెయ్యకుండా ఆపగలిగారు. దీంతో 191పరుగులకే ఆస్ట్రేలియా జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ ముగించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 244పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా జట్టు 53పరుగులు వెనకబడి ఉంది. కెప్టెన్ టిమ్ పైన్ మాత్రమే 73పరుగులతో రాణించాడు. మార్నస్ లాబుస్చాగ్నే 47పరుగుల ఇన్నింగ్స్ కొంతవరకు జట్టు స్కోరుకు సాయపడింది. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది, కాని పృథ్వీ షా మొదటి ఇన్నింగ్స్‌లో మ్యాచ్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని వికెట్ మిచెల్ స్టార్క్ తీసుకోగా.. మయాంక్ అగర్వాల్ పాట్ కమ్మిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మయాంక్ 40 బంతుల్లో 17 పరుగులకు అవుటయ్యాడు. 160 బంతుల్లో 43 పరుగులు చేసిన తర్వాత చతేశ్వర్ పుజారా అవుట్ అవగా… భారత కెప్టెన్ VIRAT KOHLI 74 పరుగుల ఇన్నింగ్స్ జట్టు స్కోరు 244కు చేరేందుకు సాయం చేసింది. వైస్ కెప్టెన్ అజింక్య రహానె 42 పరుగులకు అవుటయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా తరఫున నాలుగు వికెట్లు తీయగా.., పాట్ కమ్మిన్స్ మూడు, జోస్ హాజిల్ వుడ్ , నాథన్ లియోన్ చెరొక వికెట్ తీసుకున్నారు.