Virender Sehwag : స‌చిన్ చాలా బ‌రువు.. భుజాల‌పై మోయ‌డ‌మా.. మా వ‌ల్ల కాద‌న్నాం.. అయితే కోహ్లి మాత్రం..

2011లో ధోని సార‌ధ్యంలో భార‌త జ‌ట్టు రెండోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకున్న క్ష‌ణాల‌ను మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు, ఆ నాటి ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడైన వీరేంద్ర సెహ్వాగ్ అభిమానుల‌తో పంచుకున్నాడు.

Virender Sehwag : స‌చిన్ చాలా బ‌రువు.. భుజాల‌పై మోయ‌డ‌మా.. మా వ‌ల్ల కాద‌న్నాం.. అయితే కోహ్లి మాత్రం..

Virat Kohli Lifting Sachin Tendulkar

Updated On : June 28, 2023 / 4:27 PM IST

Sehwag : ఈ ఏడాది అక్టోబ‌ర్‌-న‌వంబ‌ర్‌లో భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023 జ‌ర‌గ‌నుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్ప‌టికే విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 5 న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండ‌గా న‌వంబ‌ర్ 19తో ముగియ‌నుంది. టీమ్ఇండియా ప్ర‌పంచ క‌ప్ గెలిచి దాదాపు 12 సంవ‌త్స‌రాలు దాటింది. దీంతో ఈ సారి స్వ‌దేశంలో జ‌ర‌గ‌నుండ‌డంతో టీమ్ఇండియా ప్ర‌పంచ క‌ప్ గెల‌వాల‌ని స‌గ‌టు భార‌త క్రీడాభిమాని కోరుకుంటున్నాడు.

ఈ క్ర‌మంలో 2011లో ధోని సార‌ధ్యంలో భార‌త జ‌ట్టు రెండోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకున్న క్ష‌ణాల‌ను మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు, ఆ నాటి ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడైన వీరేంద్ర సెహ్వాగ్ అభిమానుల‌తో పంచుకున్నాడు. ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఆట‌గాళ్ల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ కు అదే చివ‌రి ప్ర‌పంచ క‌ప్ కావ‌డంతో అత‌డిని భుజాల‌పైకి ఎత్తుకుని గ్రౌండ్ మొత్తం క‌లియ‌దిరిగారు.

TNPL : మైండ్ ఎక్క‌డ పెట్టార‌య్యా..! ర‌నౌట్ అయినా ప‌ట్టించుకోలే.. బ్యాట‌ర్ బ‌చ్‌గ‌యా

విరాట్ కోహ్లి భుజాల‌పై ఉన్న స‌చిన్ జెండాను ప‌ట్టుకున్న దృశ్యం చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. దీనికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని సెహ్వాగ్ చెప్పాడు. స‌చిన్ ను ఎందుకు తాము భుజాల‌పైకి ఎక్కించుకోలేక‌పోయానే కార‌ణాన్ని ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 షెడ్యూలింగ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ వీరూ వెల్ల‌డించాడు. స‌చిన్ చాలా బ‌రువు ఉంటాడ‌ని, మేమంద‌రం ముస‌లివాళ్లం అని న‌వ్వుతూ అన్నాడు. మాకు భుజాల నొప్పులు ఉన్నాయి. ధోనికి మోకాలి గాయం ఉంది. ఇంకొంద‌రు ఆట‌గాళ్ల‌కు ఇంకొన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయి. దీంతో ఆ భారాన్ని యువ ఆట‌గాళ్ల‌కు వ‌దిలి వేసిన‌ట్లు సెహ్వాగ్‌ చెప్పాడు.

Virender Sehwag : అప్పుడు స‌చిన్ కోసం గెలిచాం.. ఇప్పుడు కోహ్లి కోసం గెల‌వండి

యువ ఆట‌గాళ్లు అంతా క‌లిసి స‌చిన్‌ను ఎత్తుకుని గ్రౌండ్‌లో ఓ రౌండ్ కొట్టి రండి అని వారికి చెప్పాము. దీంతో విరాట్ కోహ్లి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ను భుజాన మోసిన‌ట్లు సెహ్వాగ్ తెలిపాడు. ఇక ఈ మెగా టోర్నీలో స‌చిన్ 9 మ్యాచుల్లో 482 ప‌రుగులు చేసి టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. అటు సెహ్వాగ్ 8 మ్యాచుల్లో 380 ప‌రుగులు చేశాడు. ఇక టీమ్ఇండియా ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌డంతో కీల‌క పాత్ర పోషించిన ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడ‌గా 8 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 362 ప‌రుగులు చేశాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు.

Virender Sehwag : ధోని కిచిడీ సెంటిమెంట్‌ తెలుసా..? ఆ ప్ర‌పంచ‌క‌ప్ మొత్తం అదే తిన్నాడు.. ఎందుకంటే..?

ఇదిలా ఉంటే.. రానున్న ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ సేన తొమ్మిది లీగ్ మ్యాచ్‌ల కోసం 34రోజుల వ్య‌వ‌ధిలో సుమారు 8400 కి.మీ ప్ర‌యాణించాల్సి ఉంటుంది. భార‌త్ ఫైన‌ల్‌కు చేరుకుంటే ఆ దూరం 42 రోజుల వ్య‌ధిలో 9700 కి.మీ చేర‌నుంది. మ్యాచ్‌లు ఆడుతూ ఇంత దూరం ప్ర‌యాణం చేయ‌డం ఆట‌గాళ్ల‌కు ఓ స‌వాల్ అని చెప్పాలి. దీంతో వారు త్వ‌ర‌గా అలిసిపోతారు.