Virender Sehwag : అప్పుడు సచిన్ కోసం గెలిచాం.. ఇప్పుడు కోహ్లి కోసం గెలవండి
వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత మాజీ దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Virender Sehwag wants India win
Virender Sehwag wants India win : వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు ఈ సారి ఎవరు గెలుస్తారు అనే దాన్ని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తాము సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కోసం గెలిచినట్లుగానే ఇప్పుడు విరాట్ కోహ్లి (Virat Kohli) కోసం ఖచ్చితంగా టీమ్ఇండియా వరల్డ్ కప్‌ను సాధించాలన్నాడు.
Virender Sehwag : ధోని కిచిడీ సెంటిమెంట్ తెలుసా..? ఆ ప్రపంచకప్ మొత్తం అదే తిన్నాడు.. ఎందుకంటే..?
2011 వన్డే ప్రపంచ కప్ సచిన్ టెండూల్కర్‌కు ఆఖరి ది. ఇప్పుడు రోహిత్ శర్మ, కోహ్లిలకు ఇదే చివరి వన్డే ప్రపంచకప్ అన్న సంగతి గుర్తుంచుకోవాలి. మేము ట్రోఫీని గెలిచి కానుకగా సచిన్‌కు అందించాం. అలాగే ప్రతి ఒక్కరూ ఇప్పుడు విరాట్‌కు బహుమతిగా ప్రపంచకప్ అందించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సెహ్వాగ్ తెలిపాడు.
గ్రౌండ్లో అడుగుపెట్టిన ప్రతీసారి తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కోహ్లి ప్రయత్నిస్తాడు. ఈ సారి వరల్డ్ కప్ ఆడే మైదానాల్లోని పిచ్‌ల గురించి అతడికి మంచి అవగాహన ఉంది. దీంతో అతడు పరుగుల వరద పారిస్తాడని బావిస్తున్నా. అలాగే ట్రోఫీని ముద్దాడేందుకు అతడు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాడని సెహ్వాగ్ చెప్పాడు. ట్రోఫీని అందుకుంటే అతడికి ఇది గొప్ప వీడ్కోలు అవుతుందని తెలిపాడు.
Suresh Raina : నెట్స్‌లో కఠిన బౌలర్ అతడే.. ఔటైయ్యామా.. నెలరోజులు అతడి పక్కన కూర్చోలేం
కాగా.. 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో విరాట్ కోహ్లి సభ్యుడు అన్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన నాటి ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ 35 పరుగులు చేశాడు. 31 పరుగులకే ఓపెనర్లు అయిన సెహ్వాగ్(0), సచిన్ (18) పెవిలియన్‌కు చేరడంతో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. ఆ సమయంలో వన్‌డౌన్ బ్యాటర్ అయిన గంభీర్(97)తో కలిసి విరాట్ కోహ్లి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. ఇక కోహ్లి ఔట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని (91నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 28 ఏళ్ల తరువాత భారత్‌కు మరోసారి ప్రపంచకప్‌ను అందించాడు.
1983లో కపిల్ దేవ్ సారధ్యంలో భారత్ మొట్టమొదటి సారిగా ప్రపంచకప్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి స్వదేశంలో ప్రపంచకప్ జరగనుండడంతో భారత్ విజేతగా నిలిచి 2011 ఫలితాన్ని పునరావృతం చేయాలని సగటు భారత క్రీడాభిమాని కోరుకుంటున్నాడు.