FIFA World Cup 2022: విజయానందంతో మైదానంలో తల్లితో కలిసి ఆటగాడి డ్యాన్స్

ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా తాజాగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో జట్టు 1-0తో పోర్చుగల్‌ పై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపర్చింది. తమ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లడంతో మొరాకో ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. ఆ సమయంలో మైదానంలోకి వింగర్ సోఫియాన్ బౌఫాల్ తల్లి వచ్చారు. ఆమెతో కలిసి వింగర్ సోఫియాన్ బౌఫాల్ డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.

FIFA World Cup 2022: విజయానందంతో మైదానంలో తల్లితో కలిసి ఆటగాడి డ్యాన్స్

FIFA World Cup 2022

Updated On : December 12, 2022 / 10:39 AM IST

FIFA World Cup 2022: ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా తాజాగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో జట్టు 1-0తో పోర్చుగల్‌ పై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపర్చింది. తమ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లడంతో మొరాకో ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. ఆ సమయంలో మైదానంలోకి వింగర్ సోఫియాన్ బౌఫాల్ తల్లి వచ్చారు.

ఆమెతో కలిసి వింగర్ సోఫియాన్ బౌఫాల్ డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొరాకో సంచలన విజయం సాధించడంతో ఆ గెలుపు వారు ఎంజాయ్ చేశారు. తన తల్లి మైదానంలోకి వచ్చి డ్యాన్సు చేయడంపై వింగర్ సోఫియాన్ బౌఫాల్ మీడియాతో మాట్లాడుతూ… తన కోసం తన తల్లి జీవితంలో ఎన్నింటినో త్యాగం చేసిందని చెప్పారు.

అందుకే ఆమె డ్యాన్సు చేస్తుండగా తాను కూడా ఆమెతో కలిసి కాలు కదిపానని అన్నారు. తల్లితో కలిసి డ్యాన్స్ చేసిన వింగర్ సోఫియాన్ బౌఫాల్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘తల్లే మన ప్రపంచం.. ఆమెకు ఇటువంటి గౌరవం దక్కాల్సిందే’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

CM KCR Delhi Tour : నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. డిసెంబర్ 14న బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం