ENG vs IND : పొంచి ఉన్న వర్షం ముప్పు..! ఆఖరి టెస్టులో కీలకం కానున్న టాస్..!
గురువారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Weather Report The Oval ahead of ENG vs IND 5th test
గురువారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో 2-1 తేడాతో వెనుకబడి ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. మరో వైపు ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచినా, డ్రా చేసుకున్నా కూడా సిరీస్ సొంతం అవుతుంది.
టీమ్ఇండియాకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. అక్యూవెదర్ ప్రకారం మ్యాచ్ తొలి రోజు 20 శాతం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రోజంతా ఆకాశం మేఘావృతమైన ఉంటుందని పేర్కొంది. అదే జరిగితే అప్పుడు పేసర్లకు పిచ్ నుంచి ఎక్కువగా సహకారం లభించనుంది.
WCL 2025 : సెమీస్‌లో తలపడనున్న భారత్, పాక్.. వైదొలిగిన స్పాన్సర్..!
ఇక రెండో, మూడో రోజు మాత్రం ఎలాంటి వర్ష సూచనలు లేవు. ఈ రోజుల్లో ఉష్ణోగ్రత 22 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కింది. ఇక నాలుగో రోజు కూడా వాతావరణం చాలా స్పష్టంగా ఉంటుందని అంచనా. అయితే.. ఐదో రోజు తేలిక పాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
ఈ క్రమంలో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. తొలి రోజు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇక ఈ పిచ్ నుంచి స్పిన్నర్లకు మూడో రోజు నుంచి సహకారం లభించవచ్చు. ఇక్కడ ఇటీవల జరిగిన టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 350 నుంచి 400 పరుగులు ఉంది. అంటే ఈ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామమే. కాస్త ఓపికతో ఆడితే పరుగుల వరద పారించొచ్చు. రెండు జట్లలోనూ మేటి బ్యాటర్లు ఉండడంతో ఈ టెస్టులో పరుగుల వరద పారడం ఖాయం.
ఇదిలా ఉంటే.. ఓవల్ మైదానంలో భారత్‌కు గొప్ప రికార్డు ఏమీ లేదు. 1936 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ భారత్ 15 టెస్టులు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో 7 మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.