IPL 2023: కేకేఆర్ జట్టులోకి వెస్టిండీస్ ప్లేయర్ జాన్సన్ చార్లెస్..
వెస్టిండీస్ ప్లేయర్ జాన్సన్ చార్లెస్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్. అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు లిట్టర్ దాస్ స్థానంలో తీసుకుంది.

Johnson Charle
IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. చివరి బంతి వరకు ఫలితం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంది. ఈ సీజన్‌లో పలు జట్ల ప్లేయర్లు గాయాల భారిన పడుతూ టోర్నీకి దూరమవుతున్నారు. కొందరు విదేశీ ప్లేయర్లు వ్యక్తిగత సమస్యల కారణంగా స్వదేశాలకు వెళ్తున్నారు. వీరిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్లేయర్ ఒకరు. ఆ జట్టుకు చెందిన లిట్టర్ దాస్ ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. లిట్టర్ దాస్‌ది బంగ్లాదేశ్. అతన్ని కేకేఆర్ జట్టు రూ. 50లక్షలకు సొంతం చేసుకుంది. అతను ఈ ఐపీఎల్ సీజన్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారు.
లిట్టర్ దాస్ స్థానంలో కేకేఆర్ జట్టు వెస్టిండీస్ ప్లేయర్ జాన్సన్ చార్లెస్ ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని కేకేఆర్ జట్టు యాజమాన్యం అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేసింది. చార్లెస్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్. గురువారం హైదరాబాద్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ద్వారా జట్టులో చేరతాడని కేకేఆర్ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. కోల్‌కతా జట్టు ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. వాటిలో మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది.
IPL 2023: అక్షర్ పటేల్ పై ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేకేఆర్ జట్టులో కొత్తగా చేరే జాన్సన్ చార్లెస్ వెస్టిండీస్ తరపున 41 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లు ఆడారు. 971 పరుగులు చేశాడు. 2016 ఐసీసీ ప్రపంచ టీ20 విజేతగా వెస్టిండీస్ జట్టును నిలపడంలో జాన్సన్ కీలక భూమిక పోషించారని చెప్పొచ్చు. వికెట్ కీపింగ్‌లోనూ చార్లెస్‌కు మంచి రికార్డు ఉంది. టీ20 ఫార్మాట్‌లో ఐదు స్టంప్ అవుట్‌లు చేశాడు. 82 క్యాచ్‌లు పట్టాడు. జాన్సన్ చార్లెస్ 2012 సంవత్సరంలో కేకేర్ జట్టు సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో అతన్ని రూ. 50లక్షలు వెచ్చించి కేకేఆర్ జట్టు కొనుగోలు చేసింది.
? NEWS ?@KKRiders name Johnson Charles As Replacement For Litton Das.
Details ? #TATAIPLhttps://t.co/YlXMvvsRhp pic.twitter.com/0Qtiiseqw4
— IndianPremierLeague (@IPL) May 4, 2023