Nicholas Pooran: లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్ నిర్ణయం..
వెస్టిండీస్ వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

Nicholas Pooran: వెస్టిండీస్ వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 29ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఫ్రాంచైజ్ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని వెల్లడించారు. తన రిటైర్మెంట్ కు సంబంధించి పూరన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇది ఎంతో కఠినమైన నిర్ణయం.. అయినప్పటికీ చాలా ఆలోచించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.
Also Read: Rishabh Pant: పంత్ కొడితే అట్లుంటది మరి.. పగిలిపోయిన స్టేడియం పైకప్పు.. వీడియో వైరల్..
నికోలస్ పూరన్ వెస్టిండీస్ తరపున 61 వన్డేల్లో 1983 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 106 టీ20ల్లో 2,275 పరుగులు చేశాడు. ఇటీవల టీ20ల్లో వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ఎనిమిది నెలల ముందే రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించి అభిమానులతోపాటు జట్టును షాక్ కు గురిచేశాడు.
నికోలస్ పూరన్ ఐపీఎల్ లోనూ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గ్రౌండ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 14 మ్యాచ్ లలో 524 పరుగులు సాధించాడు.
నికోలస్ పూరన్ ఏం చెప్పారంటే..
‘‘చాలా ఆలోచించిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. తాను ఎంతో ఇష్టపడే ఈ ఆట చాలా ఇచ్చింది. ఇస్తూనే ఉంటుంది. వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఎంతో ఆనందాన్ని, మరపురాని జ్ఞాపకాలు మిగిల్చింది. మెరూన్ రంగు ధరించడం, జాతీయగీతం కోసం నిలబడటం, మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ పూర్తిస్థాయిలో ప్రదర్శన ఇవ్వడం. నిజంగా మాటల్లో చెప్పడం కష్టం. కెప్టెన్‌గా జట్టును నడిపించడం నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకునే గౌరవం. నాపై చూపిన అమితమైన ప్రేమకు ధన్యవాదాలు, కష్ట సమయాల్లో నావెంటే ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో నాతో కలిసినందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. వారి నమ్మకం, మద్దతు తనను ముందుకు నడిపించాయి’’ అంటూ నికోలస్ పూరన్ చెప్పారు.
View this post on Instagram