రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఏం చెయ్యబోతున్నాడు?

ms-dhoni
దేశంలో అత్యంత విజయవంతమైన క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ధోని ఇకపై బ్లూ జెర్సీలో మైదానంలో కనిపించకపోయినా, ప్రస్తుతానికి ఐపీఎల్‌లో ఆడటం కొనసాగిస్తాడు అనేది అతని అభిమానులకు ఓదార్పునిచ్చే విషయం. ఇటువంటి సమయంలో అందరూ మహీ తరువాత ఏమి చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారు. ధోని రాబోయే తరానికి చెందిన క్రికెటర్లను సిద్ధం చేయడమే కాకుండా, దేశంలోని రైతులకు సహాయం చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు.
పదవీ విరమణ తర్వాత క్రికెట్‌తో ధోనీకి ఉన్న అనుబంధం అంతం కాదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌తో పాటు, రాబోయే కొన్నేళ్ల పాటు ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఉంటాడు ధోనీ. అతను ఈ టోర్నమెంట్ కోసం సంవత్సరంలో 3 నెలలు పనిచేస్తాడు. మిగిలిన సమయాన్ని మహీ ఏమి చేస్తారు అనే ప్రశ్న తలెత్తుతోంది.
రాబోయే రోజుల్లో ధోని ‘నియో గ్లోబల్ ఫెర్టిలైజర్’ అనే కొత్త బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నాడు. దీని కోసం ధోని పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ బ్రాండ్ ద్వారా ప్రతి గ్రామంలోని రైతులకు అవసరమైన పరికరాలు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులను అందజేస్తాడు.
దీనితో పాటు ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్‌ను కూడా నిర్మిస్తున్నాడు. ఈ పాఠశాల ద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు మరియు బాలిక విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పాఠశాల పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయి. ఇదొక్కటే కాదు, ఎంఎస్ ధోని తన అతిపెద్ద అభిరుచిని ప్రోత్సహించడానికి, అంటే క్రికెట్‌ను ప్రోత్సహించడానికి మరియు కొత్త ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వడానికి వివిధ నగరాల్లో క్రికెట్ అకాడమీలని నడుపబోతున్నాడు. ఈ అకాడమీ ద్వారా, చిన్న నగరాల నుంచి పెద్ద ఆటగాళ్లను టీం ఇండియాకు తీసుకురావాలని ధోని యోచిస్తున్నాడు.
Two roads converged on a #yellove wood… #Thala #ChinnaThala #73Forever ?? pic.twitter.com/0BDe99kp0z
— Chennai Super Kings (@ChennaiIPL) August 16, 2020