IND vs NZ : వర్షం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి? భారత్, న్యూజిలాండ్‌లలో విజేత ఎవరంటే?
వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి? భారత్, న్యూజిలాండ్ జట్లలలో ఎవరిని విజేతగా ప్రకటిస్తారని అంటే..

What Happens If Champions Trophy 2025 Final Match Gets Abandoned Due To Rain who is the winner in india and New Zealand
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9న) జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి విజేతగా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
అయితే.. ఇప్పుడు అభిమానులను ఓ ప్రశ్న తొలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పలు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో పలు జట్ల సెమీస్ అవకాశాలకు గండిపడింది. ఇక ఫైనల్ మ్యాచ్ సైతం వర్షం పడి రద్దు అయితే పరిస్థితి ఏంటి? భారత్, న్యూజిలాండ్‌లలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఎవరిని ప్రకటిస్తారు అన్న ఆసక్తి నెలకొంది.
గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల సంగతి ఎలా ఉన్నా సరే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డేలు ప్రకటించింది. అంటే ఫైనల్ మ్యాచ్ వర్షం పడి ఆదివారం జరగకపోతే సోమవారం రోజు నిర్వహిస్తారు. ఒకవేళ ఆదివారం కొంత మ్యాచ్ జరిగిన తరువాత వర్షం పడి మిగిలిన మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితులు లేకపోతే.. సోమవారం రోజు ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోతుందో అక్కడి నుంచే మొదలు పెడతారు.
ఇక సోమవారం రోజున సైతం వర్షం పడి మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఏం చేస్తారు అంటే.. కనీసం 25 ఓవర్ల చొప్పున అయిన మ్యాచ్‌ను నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యపడపోతే.. అప్పుడు ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు.
IND vs NZ : ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. భారత్ ఇక మ్యాచ్ గెలిచినట్లే..!
2002లో భారత్, శ్రీలంక జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తలపడ్డాయి. అయితే.. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు. ఇప్పుడు కూడా మ్యాచ్ రద్దైతే ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనల ప్రకారం ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు.
అయితే.. గ్రూప్ స్టేజీలో వర్షం వల్ల రద్దైన మూడు మ్యాచ్‌లు పాకిస్థాన్ వేదికగానే జరిగాయి. ఫైనల్ దుబాయ్ వేదికగా జరగనుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు దాదాపుగా వర్షం ముప్పు లేదు. మ్యాచ్ సజావుగానే జరిగే అవకాశం ఉంది.