Chahal-Mahvash : ఎవరీ ఆర్జే మహ్వాష్? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చాహల్ తో మ్యాచ్ చూసిన మిస్టరీ గర్ల్..
చాహల్‌తో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ చూసిన మిస్టరీ గర్ల్ ఎవరంటే?

Who Is RJ Mahvash Mystery Girl Spotted With Chahal During Champions Trophy Final
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సందడి చేశాడు. అతడు ఓ అమ్మాయితో కలిసి మ్యాచ్‌ను వీక్షించాడు. తన భార్య ధన శ్రీ వర్మతో చాహల్ విడాకులు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న క్రమంలో.. అతడితో ఉన్న మిస్టరీ గర్ ఎవరు? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఆమె మరెవరో కాదు ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్జే మహ్వాష్. కాగా.. మ్యాచ్ సమయంలో ఆమె ఓ స్పెలీ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాహల్ కలిసి నవ్వుతూ ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.
View this post on Instagram
కాగా.. ఇలా వీరిద్దరు కలిసి కనిపించడం ఇదే తొలిసారి కాదండోయ్. గతేడాది డిసెంబర్‌లో మహ్వాష్.. చాహల్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు మొదలు అయ్యాయి.
ఆర్జే మహ్వాష్ ఎవరు?
మహ్వాష్ అలీగ్రాలో జన్మించిన యూట్యూబర్. ప్రాంక్ వీడియోతో ఆమె బాగా పాపులర్ చెందింది. మహ్వాష్ ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా నుండి మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది.
ఓ ప్రముఖ ఎఫ్ఎంలో రేడియో జాకీగానూ ఆమె పని చేసింది. అక్కడ మంచి గుర్తింపు సాధించింది. ప్రాంక్ వీడియోలతో పాటు మహిళా సాధికారతపై అవగాహన కల్పించే అంశాలపై వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 16లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఆమెకు బాలీవుడ్‌లో నటిగా, ప్రముఖ రియాలిటీ టీవీ షో బిగ్‌బాస్ 14వ ఎడిషన్‌లో పాల్గొనే అవకాశం వచ్చినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే.. ఆ ఆఫర్లను ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు సదరు కథనాల సారాంశం.
చాహల్‌తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చిన తొలిసారే మహ్వాష్ స్పందించింది. అవన్నీ పుకార్లేనని చెప్పింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని, తన గోప్యతను గౌరవించాలని ఆమె కోరింది.
ఇదిలా ఉంటే.. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ చాహల్‌ను రూ.18కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.