ODI World Cup 2023: పెళ్లైన మరుసటి ఏడాది ప్రపంచ కప్ గెలుచుకున్న కెప్టెన్లు వీరే.. పాట్ కమిన్స్ ట్రెండ్ కొనసాగిస్తాడా?
దేశవ్యాప్తంగా వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగుతున్న వేళ ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో పలు జట్ల కెప్టెన్లు పెళ్లిచేసుకున్న ఏడాది తరువాత జరిగిన వరల్డ్ కప్ లో విజేతగా నిలిచారు.

Pat Cummins
ODI World Cup 2023 Final Match : ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తుదిపోరుకు సన్నద్ధమవుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు భారత్, ఆస్ట్రేలియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వరల్డ్ కప్ లో ఓటమి లేకుండా వరుస విజయాలు సాధించిన టీమిండియా ఫైనల్లోనూ విజయం సాధించాలని దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగుతున్న వేళ ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో పలు జట్ల కెప్టెన్లు పెళ్లిచేసుకున్న ఏడాది తరువాత జరిగిన వరల్డ్ కప్ లో విజేతగా నిలిచారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ ను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కొనసాగిస్తాడా? అనే చర్చ కొనసాగుతుంది.
వన్డే ప్రపంచ కప్ లో 2003లో ఆస్ట్రేలియా, 2011లో ఇండియా, 2019లో ఇంగ్లాండ్ జట్లు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీల్లో విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్లు అంతకుముందు ఏడాదే వివాహం చేసుకున్నారు. 2022లో రికీ పాంటింగ్ పెళ్లి చేసుకున్నాడు. 2003 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది. జట్టుకు నాయకత్వం వహించింది పాంటింగ్ నే. 2010లో మహేంద్ర సింగ్ ధోనీ వివాహం చేసుకున్నాడు. 2011 వరల్డ్ కప్ లో టీమిండియా విజయం సాధించాడు. అప్పుడు జట్టుకు నాయకత్వం వహించింది ధోనీనే. 2018లో మోర్గాన్ పెళ్లి చేసుకున్నాడు.. 2019లో జరిగిన వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఆ మెగా టోర్నీలో జట్టుకు నాయకత్వం వహించింది మోర్గానే.
Also Read : IND vs AUS : నేడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్.. అహ్మదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా ఢీ
ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఆ ట్రెండ్ ను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కొనసాగిస్తాడా? అనేఅంశం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. 2022లో పాట్ కమిన్సన్ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం 2023 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు సారధిగా కమిన్స్ ఉన్నాడు. మరి ఆనవాయితీని కమిన్స్ కొనసాగిస్తాడా? లేదా అనేది ఈరోజు తేలనుంది.
View this post on Instagram