విలియమ్సన్ ఇంట్లో విషాదం, చెన్నైతో మ్యాచ్‌కు దూరం

సీజన్ ఆరంభం నుంచి అందుబాటులో లేని ప్రతి మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన భువనేశ్వర్ కుమార్ మరో సారి కెప్టెన్ పగ్గాలు చేపట్టనున్నాడు. అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న షకీబ్ అల్ హసన్‌కు జట్టులో..

విలియమ్సన్ ఇంట్లో విషాదం, చెన్నైతో మ్యాచ్‌కు దూరం

Updated On : April 23, 2019 / 12:25 PM IST

సీజన్ ఆరంభం నుంచి అందుబాటులో లేని ప్రతి మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన భువనేశ్వర్ కుమార్ మరో సారి కెప్టెన్ పగ్గాలు చేపట్టనున్నాడు. అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న షకీబ్ అల్ హసన్‌కు జట్టులో..

ఐపీఎల్ 12వ సీజన్ ఆరంభం నుంచి కొన్ని మ్యాచ్‌లలో మాత్రమే కనిపించిన విలియమ్‌సన్.. మరోసారి లీగ్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. చెన్నైతో చిదంబరం స్డేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కు ముందే నాయనమ్మ మరణ వార్త తెలిసింది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది. 

వెంటనే న్యూజిలాండ్‌కు బయల్దేరిన విలియమ్సన్ ఏప్రిల్ 27న జైపూర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో గేమ్‌కు అందుబాటులోనే ఉంటాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తెలిపింది. 

సీజన్ ఆరంభం నుంచి అందుబాటులో లేని ప్రతి మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన భువనేశ్వర్ కుమార్ మరో సారి కెప్టెన్ పగ్గాలు చేపట్టనున్నాడు. అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న షకీబ్ అల్ హసన్‌కు జట్టులో స్థానం దక్కుతుందో లేదో చూడాలి. షకీబ్ మిస్సయితే ఆ స్థానం మహ్మద్ నబీని వరించాలి. 

ఐపీఎల్ 12వ సీజన్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 5 మాత్రమే గెలిచిన హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.