NED vs AFG : నెద‌ర్లాండ్స్ పై ఘ‌న విజ‌యం.. సెమీస్ రేసులోకి దూసుకు వ‌చ్చిన అఫ్గానిస్థాన్‌.. పాకిస్థాన్‌కు క‌ష్టాలే..!

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్థాన్ జ‌ట్టు అంచ‌నాల‌ను మించి రాణిస్తోంది.

NED vs AFG : నెద‌ర్లాండ్స్ పై ఘ‌న విజ‌యం.. సెమీస్ రేసులోకి దూసుకు వ‌చ్చిన అఫ్గానిస్థాన్‌.. పాకిస్థాన్‌కు క‌ష్టాలే..!

Afghanistan

Updated On : November 3, 2023 / 8:12 PM IST

Netherlands Vs Afghanistan : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్థాన్ జ‌ట్టు అంచ‌నాల‌ను మించి రాణిస్తోంది. ల‌క్నో వేదిక‌గా నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ టోర్నీలో అఫ్గానిస్థాన్‌కు ఇది నాలుగో గెలుపు కావ‌డం గ‌మ‌నార్హం. 8 పాయింట్ల‌తో ప్ర‌స్తుతం ప‌ట్టిక‌లో ఐదో స్థానానికి చేరుకుని సెమీస్ రేసులోకి దూసుకువ‌చ్చింది. ఈ టోర్నీలో అఫ్గాన్ మ‌రో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది.

ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే సెమీస్ చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయి. అలాకాకుండా ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా స‌మీక‌ర‌ణాలు క‌లిసి వ‌స్తే సెమీస్‌కు వెళ్లొచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచులు ఆడిన పాకిస్థాన్ మూడింటిలో గెలిచి 6 పాయింట్ల‌తో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించిన నేపాల్‌, ఒమ‌న్‌.. ఇక మిగిలింది రెండే..

180 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అఫ్గానిస్థాన్ 31.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయిన ఛేదించింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో రహమత్ షా (52; 54 బంతుల్లో 8 ఫోర్లు), హష్మతుల్లా షాహిదీ (56 నాటౌట్; 64 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (31 నాటౌట్‌), ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (20) లు రాణించారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (58; 86 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మాక్స్ ఓడౌడ్(42; 40 బంతుల్లో 9 ఫోర్లు), కోలిన్ అకెర్‌మాన్(29) లు రాణించారు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డం, ఈ ముగ్గురితో పాటు స్కాట్ ఎడ్వర్డ్స్(0) సైతం ర‌నౌట్ కావ‌డంతో నెద‌ర్లాండ్స్ స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమితమైంది. అఫ్గానిస్థాన్ బౌలర్లలో మహ్మద్ నబీ మూడు వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టారు. ముజీబ్ ఉర్ రహ్మాన్ ఓ వికెట్ సాధించాడు.

Rohit Sharma : ఆ ఇద్ద‌రూ చెబితేనే డీఆర్ఎస్‌కు వెళ్తా.. నేను దానిలో త‌ల‌దూర్చ‌ను : రోహిత్ శ‌ర్మ‌