AUS vs NZ : ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం.. వరుసగా నాలుగో మ్యాచ్‌లో గెలుపు
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా దూసుకుపోతుంది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆసీస్ ఆ తరువాత వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించింది.

Australia
Australia vs New Zealand : వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా దూసుకుపోతుంది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆసీస్ ఆ తరువాత వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించింది. శనివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచులో 5 పరుగులు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్ మూడో స్థానంలో, ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. 389 పరుగులతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 383 పరుగులకు పరిమితమైంది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (116; 89 బంతుల్లో 9 ఫోర్లు, 5సిక్సర్లు) శతకంతో రాణించాడు. డారిల్ మిచెల్ (54; 51 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), జేమ్స్ నీషమ్ (58; 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్ , హేజిల్ వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. గ్లెన్ మాక్స్‌వెల్ ఓ వికెట్ సాధించాడు.
Australia overcame a resilient fight from their Trans-Tasman rivals New Zealand to take two crucial #CWC23 points in Dharamsala ?#AUSvNZ ?: https://t.co/b25f3XwNH2 pic.twitter.com/ArttXrdCJb
— ICC Cricket World Cup (@cricketworldcup) October 28, 2023
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (109; 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసకర శతకం బాదాడు. డేవిడ్ వార్నర్ (81; 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 41, జోష్ ఇంగ్లిస్ 38, పాట్ కమిన్స్ 37, మిచెల్ మార్ష్ 36, స్టీవెన్ స్మిత్ 18, లబుషేన్ 18 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫిలిప్స్ మూడేసి వికెట్లు తీశారు. మిచెల్ సాంట్నర్ రెండు, మాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టాడు.