World Cup 2023 NED vs SL: ఖాతా తెరిచిన శ్రీలంక.. నెదర్లాండ్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపు
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఎట్టకేలకు శ్రీలంక బోణి కొట్టింది. నాలుగో మ్యాచ్ ఆడిన శ్రీలంక తొలి విజయాన్ని అందుకుంది.

Sri Lanka won by 5 wickets
నెదర్లాండ్స్ పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు
వన్డే ప్రపంచకప్ లో ఎట్టకేలకు శ్రీలంక ఖాతా తెరిచింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 263 పరుగుల లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేరుకుంది. సదీర సమరవిక్రమ 91 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. పాతుమ్ నిస్సాంక (54), అసలంక (44), ధనంజయ డిసిల్వా (30) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లో ఆర్యన్ దత్ 3 వికెట్లు పడగొట్టాడు. పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మాన్ చెరో వికెట్ తీశారు.
అసలంక అవుట్.. నాలుగో వికెట్ డౌన్
32.4 ఓవర్ లో 181 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. చరిత్ అసలంక 66 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ తో 44 పరుగులు చేసి అవుటయ్యాడు. 35 ఓవర్లలో 197/4 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.
సమరవిక్రమ హాఫ్ సెంచరీ
శ్రీలంక సదీర సమరవిక్రమ హాఫ్ సెంచరీ సాధించాడు. 53 బంతుల్లో 4 ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. 32 ఓవర్లలో 181/3 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.
Sadeera Samarawickrama keeps Sri Lanka calm in the chase with a composed fifty ?https://t.co/skDRqJ3yeo #NEDvSL #CWC23 pic.twitter.com/MKw4gbDa7N
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2023
3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక
16.1 ఓవర్ లో 104 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. పాతుమ్ నిస్సాంక 54 పరుగులు చేసి అవుటయ్యాడు. 22 ఓవర్లలో 122/3 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.
నిస్సాంక హాఫ్ సెంచరీ
శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీ చేశాడు. 48 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. 16 ఓవర్లలో 104/2 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.
Pathum Nissanka brings up his 12th ODI half-century.#CWC23 #NEDvSL #ICCCricketWorldCup pic.twitter.com/DkXcHXzPZs
— Cricket Addictor (@AddictorCricket) October 21, 2023
2 వికెట్లు కోల్పోయిన శ్రీలంక
263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 52 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. కుశాల్ పెరెరా (5), కుశాల్ మెండిస్ (11) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. 12 ఓవర్లలో 68/2 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.
262 పరుగులకు నెదర్లాండ్స్ ఆలౌట్
శ్రీలంకకు నెదర్లాండ్స్ 263 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన డచ్ టీమ్ 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటయింది. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(70), లోగాన్ వాన్ బీక్(59) హాఫ్ సెంచరీలు సాధించడంతో నెదర్లాండ్స్ మంచి స్కోరు చేసింది. కసున్ రజిత, దిల్షన్ మధుశంక నాలుగేసి వికెట్లు తీశారు. మహేశ్ తీక్షణ ఒక విక్కెట్
దక్కించుకున్నాడు.
ఒకే ఒక్క ఫోర్ తో హాఫ్ సెంచరీ
తర్వాత లోగాన్ వాన్ బీక్ కూడా అర్ధశతకం చేశాడు. 68 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికి ఇది మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. 47 ఓవర్లలో 243/7 స్కోరుతో డచ్ టీమ్ ఆట కొనసాగిస్తోంది.
He retired in 2016. Playing top-tier cricket wasn’t realistic. He did his MBA. He is still working full-time.
He came back to cricket. Today, Sybrand Engelbrecht, 35, hits his first ODI fifty. In the World Cup. What a story ? https://t.co/skDRqJ3yeo | #NEDvSL | #CWC23 pic.twitter.com/8joUDXXHqY
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2023
సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ హాఫ్ సెంచరీ
సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 82 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ లో 70 పరుగులు చేసి ఏడో వికెట్ గా అవుటయ్యాడు. 46 ఓవర్లలో 230/7 స్కోరుతో డచ్ టీమ్ ఆట కొనసాగిస్తోంది.
A fighting 5️⃣0️⃣ for Engelbrecht in only his 3rd ODI appearance. A ? knock under pressure as he brings us back into the game with a crucial partnership with LVB.
Keep believing. ?#NEDvSL #CWC23 pic.twitter.com/zTe03c4WAB
— Cricket?Netherlands (@KNCBcricket) October 21, 2023
150 దాటిన నెదర్లాండ్స్ స్కోరు
సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్ కీలక భాగస్వామ్యంతో నెదర్లాండ్స్ కోలుకుంది. ఏడో వికెట్ కు వీరిద్దరూ 60 పరుగులు పైగా భాగస్వామ్యం నమోదు చేయడంతో డచ్ టీమ్ స్కోరు 150 దాటింది. 36 ఓవర్లలో 153/6 స్కోరుతో నెదర్లాండ్స్ ఆట కొనసాగిస్తోంది.
ఎడ్వర్డ్స్ అవుట్.. ఆరో వికెట్ డౌన్
21.2 ఓవర్ లో 91 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కాట్ ఎడ్వర్డ్స్ 16 పరుగులు చేసి మహేశ్ తీక్షణ బౌలింగ్ లో అవుటయ్యాడు. 29 ఓవర్లలో 116/6 స్కోరుతో డచ్ టీమ్ ఆట కొనసాగిస్తోంది.
నిరాశపరిచిన తెలుగబ్బాయి
నెదర్లాండ్స్ జట్టు తరపున ఆడుతున్న తెలుగు కుర్రాడు తేజ నిడమూరు ఈ రోజు మ్యాచ్ లోనూ నిరాశపరిచాడు. 16 బంతుల్లో 9 పరుగులు చేసి మధుశంక బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. 21 ఓవర్లలో 90/5 స్కోరుతో డచ్ టీమ్ ఆట కొనసాగిస్తోంది.
బాస్ డి లీడే అవుట్.. నాలుగో వికెట్ డౌన్
16.5 ఓవర్ లో 68 పరుగుల వద్ద నెదర్లాండ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. బాస్ డి లీడే 6 పరుగులు చేసి దిల్షన్ మధుశంక బౌలింగ్ లో అవుటయ్యాడు. 18 ఓవర్లలో 71/4 స్కోరుతో డచ్ టీమ్ ఆట కొనసాగిస్తోంది.
కోలిన్ అవుట్.. మూడో వికెట్ డౌన్
11.6 ఓవర్ లో 54 పరుగుల వద్ద నెదర్లాండ్స్ మూడో వికెట్ కోల్పోయింది. కోలిన్ అకెర్‌మాన్ 29 పరుగులు చేసి కసున్ రజిత బౌలింగ్ లో అవుటయ్యాడు. 14 ఓవర్లలో 57/3 స్కోరుతో డచ్ టీమ్ ఆట కొనసాగిస్తోంది.
2 వికెట్లు నష్టపోయిన నెదర్లాండ్స్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ 10 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 48 పరుగులు చేసింది. విక్రమ్‌జిత్ సింగ్ 4, మాక్స్ ఓడౌడ్ 16 పరుగులు చేసి అవుటయ్యారు. కసున్ రజిత బౌలింగ్ లో వీరిద్దరూ అవుటయ్యారు.
టాస్ గెలిచిన నెదర్లాండ్స్
NED vs SL: ఐసీసీ వన్డే ప్రపంచకప్ భాగంగా నేడు జరగనున్న 19వ మ్యాచ్ లో నెదర్లాండ్స్, శ్రీలంక తలపడుతున్నాయి. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Scott Edwards wins the toss and chooses to bat first. #NEDvSL #CWC #SLvNED pic.twitter.com/W2HSLJwiDr
— Cric Vibes (@VibesCric) October 21, 2023
తుది జట్లు
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా, కుసల్ మెండిస్(కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక
నెదర్లాండ్స్ : విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్టెన్, పాల్ వాన్ మీకెరెన్