World Cup Final Match : భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. ఆకాశాన్నంటిన విమాన ఛార్జీలు.. ఫైవ్ స్టార్ హోటల్ టారిఫ్ ధరలు పైపైకి..!
World Cup Final Match : ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం చుట్టుపక్కలా ఉండే స్టార్ హోటళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాదు.. నగరానికి వచ్చేపోయే విమానాల టిక్కెట్ల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.

World Cup Final Match _ Narendra Modi Stadium, 100 private jets, airfares, up to 29times hotel tariffs
World Cup Final Match : ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తుదిపోరుకు సన్నద్ధమవుతున్నాయి. నవంబర్ 19 (ఆదివారం) జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేటియం వేదిక కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు భారత్, ఆస్ట్రేలియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్, ఆసీస్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద అన్ని రహదారులు వాహనాల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. పండుగల సీజన్, అందులోనూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కారణంగా నగరంలోకి భారీగా రద్దీ నెలకొంది.
అంతేకాదు.. నగరంలో విమాన ఛార్జీలు, హోటల్ టారిఫ్‌లు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రధానంగా ఢిల్లీ, ముంబై నుంచి అహ్మదాబాద్‌కి విమానంలో ప్రయాణించడానికి చివరి నిమిషంలో బుక్ చేసుకున్నప్పటికీ సాధారణంగా రూ. 8వేల నుంచి రూ. 10వేల వరకు ఖర్చు అవుతుంది. ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్స్ ప్రకారం.. నవంబర్ 18 నుంచి 20 మధ్య తేదీల్లో ఈ విమాన ఛార్జీలు 300శాతం పెంపుతో వరుసగా రూ. 31వేల నుంచి రూ. 43వేలు వరకు పెరిగాయి. ఇతర నగరాల నుంచి విమాన ఛార్జీలు కూడా సాధారణ రోజులతో పోలిస్తే.. కనీసం 150 నుంచి 200 శాతం పెరిగాయి.

World Cup Final Match
క్రికెట్ పుణ్యామని.. మద్యానికి ఫుల్ డిమాండ్ :
అంతేకాదు.. క్రికెట్ మ్యాచ్ కారణంగా మద్యానికి కూడా భారీ గిరాకీ పెరిగింది. అహ్మదాబాద్‌లో ఒక రాత్రికి పీక్ సీజన్ సగటు రోజువారీ రేటు (ADR) రూ. 7,500 కన్నాఎక్కువగా ధరలు పెరిగాయి. బేస్ కేటగిరీ గదికి అత్యధిక సుంకం 29 రెట్లు ఎక్కువగా పెరిగాయని ట్రావెల్ అగ్రిగేటర్‌లతో పాటు నగరంలోని హోటళ్ల అధికారిక వెబ్‌సైట్‌లు సూచిస్తున్నాయి. అంటే.. రూ. 6,500 నుంచి 12,500 మధ్య ఉండే ఫైవ్ స్టార్ హోటళ్లలో బేస్ కేటగిరీ హోటల్ రూమ్‌లకు ఈ వారాంతంలో పన్నులు కలిపి మొత్తంగా రూ. 25వేల నుంచి 2 లక్షల మధ్య రిటైల్ అవుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వందకు పైగా ప్రైవేటు జెట్స్, స్టార్ హోటళ్లకు ఫుల్ గిరాకీ :
హెచ్‌ఆర్‌ఏ-గుజరాత్ ప్రెసిడెంట్ నరేంద్ర సోమాని మాట్లాడుతూ.. ‘క్రికెట్ జట్టు సభ్యులు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), మీడియా ప్రతినిధులు, టీమ్ స్పాన్సర్‌లు, కార్పొరేట్ టైకూన్‌లు, వివిఐపిలు, సెలబ్రిటీలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్‌కు చేరుకుంటారని భావిస్తున్నారు.

World Cup Final Match hotel tariffs
ఇది కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే కాకుండా ఇతర త్రీ స్టార్, ఫోర్ స్టార్ హోటళ్లకు కూడా భారీ డిమాండ్ పెరిగింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇంటర్నేషనల్ (SVPI) విమానాశ్రయంలో రాబోయే రెండు రోజుల్లో నాన్-షెడ్యూల్డ్ చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 100కి చేరుకునే అవకాశం ఉందని సమీప వర్గాలు తెలిపాయి. అంటే.. సిటీ ఎయిర్‌పోర్టు ద్వారా నడిచే దాదాపు 250 నుంచి 300 షెడ్యూల్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అంతకంటే ఎక్కువగానే ఉంటాయని అంచనా.
ఫైనల్ మ్యాచ్ వీక్షించనున్న ప్రధాని మోదీ :
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీక్షించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, క్రీడా దిగ్గజాలు, వ్యాపార దిగ్గజాలు, బాలీవుడ్ ప్రముఖులు, సంగీత విద్వాంసులు నగరానికి చేరుకుని ఫైనల్ మ్యాచ్‌ను స్టార్-స్టడెడ్ ఎఫైర్‌గా మార్చాలని భావిస్తున్నారు. చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఎక్కువ భాగం ముంబై, ఢిల్లీ నుంచి వస్తాయని భావిస్తున్నారు.
అయితే, కొన్ని ఇతర భారతీయ నగరాల నుంచి కూడా వస్తాయని చెబుతున్నారు. ప్రైవేట్ జెట్లను పార్కింగ్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం సిటీ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ ఇతర ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌లతో సమన్వయం చేసుకుంటున్నాయని అంటున్నారు. టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడంతో దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో ఈ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ వీక్షించేందుకు వందలాది మంది అహ్మదాబాద్‌కు చేరుకుంటున్నారు.

World Cup Final Match Stadium
బుకింగ్ కోసం క్యూ కడుతున్న క్రికెట్ అభిమానులు :
చాలామంది తమ కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ వీక్షించేందుకు ముందుగానే ప్లానింగ్ చేసుకుంటున్నామని, స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో ఎదురుచూస్తున్నామని అంటున్నారు. రెండు రోజుల క్రితం వస్త్రాపూర్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు టీమ్ ఇండియా చేరుకున్న సమయంలో హోటల్ గేట్ వెలుపల క్రికెట్ అభిమానుల నుంచి అద్భుతమైన స్వాగతం లభించింది. అహ్మదాబాద్‌లోని ఆక్యుపెన్సీ స్థాయిలు, సుంకాలు ఎక్కువగా ఉన్నందున దేశవ్యాప్తంగా ప్రయాణికులు, ప్రముఖులు తరలిరావడం అహ్మదాబాద్‌లోని ఆతిథ్య పరిశ్రమకు మేజర్ బూస్టర్ డోస్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ (HRA) అంచనాల ప్రకారం.. గుజరాత్ హోటళ్లు ఇప్పటికే 80శాతం ఆక్యుపెన్సీని ఆక్రమించాయని సూచిస్తున్నాయి. టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నప్పటికీ, బుకింగ్ చేసుకునేందుకు ఆఖరి నిమిషంలోనూ కస్టమర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
Read Also : Hardik Pandya : ‘కప్‌ను ఇంటికి తీసుకువద్దాం’.. టీమిండియాకు హార్దిక్ పాండ్యా స్పెషల్ మెసేజ్..!