World Cup 2023 IND Vs PAK: 7 వికెట్ల తేడాతో భార‌త్ విజ‌యం

క్రికెట్ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానేవచ్చింది. వన్డే వరల్డ్ కప్ లో ఇంట్రస్టింగ్ మ్యాచ్ కు తెర లేచింది.

World Cup 2023 IND Vs PAK: 7 వికెట్ల తేడాతో భార‌త్ విజ‌యం

world up 2023 ind vs pak odi live updates and highlights in telugu

Updated On : October 14, 2023 / 8:08 PM IST

భార‌త్ విజ‌యం

192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమ్ఇండియా 30.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

25 ఓవ‌ర్ల‌లో భార‌త స్కోరు 165/3

భార‌త ఇన్నింగ్స్‌లో స‌గం ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. 25 ఓవ‌ర్ల‌లో భార‌త స్కోరు 165/3. కేఎల్ రాహుల్ (4), శ్రేయ‌స్ అయ్య‌ర్ (41) లు ఆడుతున్నారు.

రోహిత్ శ‌ర్మ ఔట్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో ఇఫ్తీకర్ అహ్మద్ క్యాచ్ అందుకోవ‌డంతో రోహిత్ శ‌ర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 21.4వ ఓవ‌ర్‌లో 156 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

20 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 142/2
ఇన్నింగ్స్ 20వ ఓవ‌ర్‌ను షాబాద్ వేశాడు. ఆఖ‌రి రెండు బంతుల‌ను రోహిత్ శ‌ర్మ ఫోర్‌, సిక్స్‌లుగా మ‌లిచాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 20 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 142/2. రోహిత్ శ‌ర్మ (80), శ్రేయ‌స్ అయ్య‌ర్ (28) లు ఆడుతున్నారు.

రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ
షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో(13.1వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి రోహిత్ శ‌ర్మ 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్ సెంచ‌రీ చేశాడు.

విరాట్ కోహ్లీ ఔట్‌
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. హ‌స‌న్ అలీ బౌలింగ్‌లో న‌వాజ్ క్యాచ్ అందుకోవ‌డంతో విరాట్ కోహ్లీ (16; 18 బంతుల్లో 3ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 9.5వ ఓవ‌ర్‌లో 79 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

రోహిత్ శ‌ర్మ రెండు సిక్స‌ర్లు
రోహిత్ శ‌ర్మ దూకుడుగా ఆడుతున్నాడు. హరీస్ రవూఫ్ వేసిన తొమ్మిదో ఓవ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ రెండు సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 77/1. విరాట్ కోహ్లీ (15), రోహిత్ శ‌ర్మ (44) లు ఆడుతున్నారు.

15 ప‌రుగులు
ఇన్నింగ్స్ ఏడో ఓవ‌ర్‌ను షాహీన్ అఫ్రిది వేశాడు. తొలి బంతికి రోహిత్ శ‌ర్మ సిక్స్ కొట్ట‌గా, నాలుగు, ఐదు బంతుల‌ను విరాట్ కోహ్లీ ఫోర్లుగా మ‌లిచాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు 54/1. విరాట్ కోహ్లీ (13), రోహిత్ శ‌ర్మ (23) లు ఆడుతున్నారు.

5 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 38/1
భార‌త ఇన్నింగ్స్‌లో మొద‌టి 5 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. టీమ్ఇండియా వికెట్ న‌ష్టపోయి 38 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ (15), విరాట్ కోహ్లీ (5) లు ఆడుతున్నారు.

గిల్ ఔట్‌
భార‌త్‌కు షాక్ త‌గిలింది. దూకుడుగా ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్ ఔట్ అయ్యాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో గిల్ (16; 11 బంతుల్లో 4 ఫోర్లు) షాదాబ్ ఖాన్ చేతికి చిక్కాడు. దీంతో 2.5వ ఓవ‌ర్‌లో 23 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఒకే ఓవ‌ర్‌లో గిల్ మూడు ఫోర్లు
ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌ను హ‌స‌న్ అలీ వేయ‌గా శుభ్‌మ‌న్ గిల్ మూడు ఫోర్లు బాదాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 22/0. రోహిత్ శ‌ర్మ‌(5), శుభ్‌మ‌న్ గిల్ (16) లు ఆడుతున్నారు.

రోహిత్, గిల్‌ చెరో ఫోర్‌
స్వ‌ల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు భార‌త ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ లు బ‌రిలోకి దిగారు. షాహీన్ అఫ్రిది మొద‌టి ఓవ‌ర్‌ను వేయ‌గా తొలి బంతికి రోహిత్ శ‌ర్మ‌, మూడో బంతికి శుభ్‌మ‌న్ గిల్ లు ఫోర్లు కొట్టారు. 1 ఓవ‌ర్‌కు భార‌త స్కోరు 10/0. రోహిత్ శ‌ర్మ‌(5), శుభ్‌మ‌న్ గిల్ (4) లు ఆడుతున్నారు.

భార‌త ల‌క్ష్యం 192
భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 42.5 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగుల‌కే ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో బాబ‌ర్ ఆజాం (50; 58 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (49; 69 బంతుల్లో 7 ఫోర్లు) ఒక్క ప‌రుగు తేడాతో అర్థ‌శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. ఇమామ్ ఉల్ హక్ (36), అబ్దుల్లా షఫీక్ (20) లు ఓ మోస్త‌రుగా రాణించ‌గా, సౌద్ షకీల్ (6), ఇఫ్తీకర్ అహ్మద్ (4), షాదాబ్ ఖాన్ (2) లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్, హార్ధిక్ పాండ్య‌, ర‌వీంద్ర జ‌డేజా లు త‌లా రెండు వికెట్లు తీశారు.

హ‌స‌న్ అలీ ఔట్‌..
జ‌డేజా బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్ క్యాచ్ అందుకోవ‌డంతో హ‌స‌న్ అలీ (12) ఔట్ అయ్యాడు. దీంతో 40.1వ ఓవ‌ర్‌లో 187 ప‌రుగుల వ‌ద్ద పాకిస్థాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

న‌వాజ్ ఔట్‌.. 
పాకిస్థాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో న‌వాజ్ (4) బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో పాకిస్థాన్ 39.6వ ఓవ‌ర్‌లో 187 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

షాదాబ్ ఖాన్ క్లీన్ బౌల్డ్‌.. 
బుమ్రా బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పాకిస్థాన్ 35.2వ ఓవ‌ర్‌లో 171 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది.

రిజ్వాన్ ఔట్‌
భార‌త బౌల‌ర్లు విజృంభిస్తుండ‌డంతో పాకిస్థాన్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. బుమ్రా బౌలింగ్‌లో (33.6వ ఓవ‌ర్‌)లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (49; 69 బంతుల్లో 7 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పాకిస్థాన్ 168 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 34 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 168/6.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన కుల్దీప్..
కుల్దీప్ యాద‌వ్ పాకిస్థాన్‌ను గ‌ట్టి దెబ్బ కొట్టాడు. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇన్నింగ్స్ 33 ఓవ‌ర్‌ను కుల్దీప్ వేశాడు. రెండో బంతికి సౌద్ షకీల్ (6) ఎల్భీగా ఔట్ చేయ‌గా, ఆఖరి బంతికి ఇఫ్తీకర్ అహ్మద్ (4) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో పాకిస్థాన్ 166 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

బాబ‌ర్ ఆజాం హాఫ్ సెంచ‌రీ.. ఆ వెంట‌నే ఔట్‌
కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో(28.6వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టి బాబ‌ర్ ఆజాం 57 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఆ మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనే అత‌డు ఔట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో బాబ‌ర్ ఆజాం (50; 58 బంతుల్లో 7ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 29.4వ ఓవ‌ర్‌లో పాకిస్థాన్ 155 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 30 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 156/3. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (47), సౌద్ షకీల్ (1) లు ఆడుతున్నారు.

25 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 125/2
పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో స‌గం ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. 25 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 125/2. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (33), బాబ‌ర్ ఆజాం (35) లు ఆడుతున్నారు.

వంద ప‌రుగులు దాటిన పాకిస్థాన్ స్కోరు
పాకిస్థాన్ బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో(18.3వ ఓవ‌ర్‌) బాబ‌ర్ ఆజాం ఫోర్ కొట్ట‌డంతో పాకిస్థాన్ స్కోరు వంద దాటింది. 19 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 102/2. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (15), బాబ‌ర్ ఆజాం (30) లు ఆడుతున్నారు.

15 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 79/2.
పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో మొద‌టి ప‌దిహేను ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. రెండు వికెట్లు కోల్పోయిన పాక్ 79 ప‌రుగులు చేసింది. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (6), బాబ‌ర్ ఆజాం (16) లు ఆడుతున్నారు.

ఇమామ్ ఔట్‌.. 
హార్ధిక్ పాండ్య బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హక్ (36; 38 బంతుల్లో 6 ఫోర్లు) కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 12.3వ ఓవ‌ర్‌లో 73 ప‌రుగుల వ‌ద్ద పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది.

బాబ‌ర్ ఆజామ్ రెండు ఫోర్లు
ఇన్నింగ్స్ ప‌ద‌కొండో ఓవ‌ర్‌ను హార్దిక్ పాండ్య వేయ‌గా చివ‌రి రెండు బంతుల‌ను బాబ‌ర్ ఆజామ్ ఫోర్లుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 60/1. ఇమామ్ ఉల్ హక్ (25), బాబ‌ర్ ఆజాం (14) లు ఆడుతున్నారు.

10 ఓవ‌ర్ల‌కు పాక్ స్కోరు 49/1
పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో మొద‌టి ప‌ది ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. వికెట్ న‌ష్ట‌పోయిన పాక్ 49 ప‌రుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ (23), బాబ‌ర్ ఆజాం (5) లు ఆడుతున్నారు.

షఫీక్ ఔట్
ఎట్ట‌కేల‌కు భార‌త బౌల‌ర్లు వికెట్ ప‌డ‌గొట్టారు. మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో అబ్దుల్లా షఫీక్ (20; 24 బంతుల్లో 3 ఫోర్లు) ఎల్భీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 41 ప‌రుగుల వ‌ద్ద పాకిస్థాన్ మొద‌టి వికెట్ కోల్పోయింది. 8 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 41/1. ఇమామ్ ఉల్ హక్ (13), బాబ‌ర్ ఆజాం (0) లు ఆడుతున్నారు.

బుమ్రా మెయిడిన్‌
పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌కు బుమ్రా ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. ఇన్నింగ్స్ ఐదో ఓవ‌ర్‌ను వేసిన బుమ్రా ఒక్క ప‌రుగు ఇవ్వ‌లేదు. 5 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 23/0. అబ్దుల్లా షఫీక్ (10), ఇమామ్ ఉల్ హక్ (13) లు ఆడుతున్నారు.

షఫీక్ షోర్‌
మూడో ఓవ‌ర్‌ను బుమ్రా వేయ‌గా ఒక్క ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. నాలుగో ఓవ‌ర్‌ను సిరాజ్ వేయ‌గా మొద‌టి బంతికి ష‌ఫీక్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 6 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 23/0. అబ్దుల్లా షఫీక్ (10), ఇమామ్ ఉల్ హక్ (13) లు ఆడుతున్నారు

ఒకే ఓవ‌ర్‌లో ఇమామ్ ఉల్ హక్ మూడు ఫోర్లు
రెండో ఓవ‌ర్‌ను సిరాజ్ వేయ‌గా ఇమామ్ ఉల్ హ‌క్ మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో మొత్తం 12 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు పాకిస్థాన్ స్కోరు 16/0. అబ్దుల్లా షఫీక్ (4), ఇమామ్ ఉల్ హక్ (12) లు ఆడుతున్నారు.

అబ్దుల్లా షఫీక్ ఫోర్‌..
మొద‌టి ఓవ‌ర్‌ను బుమ్రా చేశాడు. మొద‌టి ఐదు బంతుల‌ను క‌ట్టుదిట్టంగా వేశాడు. అయితే.. ఆరో బంతికి అబ్దుల్లా షఫీక్ ఫోర్ కొట్టాడు. 1 ఓవ‌ర్‌కు పాకిస్థాన్ స్కోరు 4/0. అబ్దుల్లా షఫీక్ (4), ఇమామ్ ఉల్ హక్ (0) లు ఆడుతున్నారు.

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. గిల్ వచ్చేశాడు
టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. పిచ్ పై మంచు ప్రభావం చూపే అవకాశముందని అందుకే ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పాడు. కాగా టీమిండియాలో ఒక మార్పు చోటు చేసుకుంది. ఇషాన్ కిషన్ స్థానంలో శుభమన్ గిల్ జట్టులోకి వచ్చాడు. టాస్ ఓడిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. కాగా, టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకోవాలనుకున్నట్టు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తెలిపాడు. తమ జట్టులో ఎటువంటి మార్పులు లేవని చెప్పాడు.

 

మోదీ స్టేడియంలో సందడి
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం జన సముద్రంగా మారింది. క్రికెట్ లవర్స్ పెద్ద సంఖ్యలో రావడంతో స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.

వాతావరణం ఓకే.. నో టెన్షన్
భారత్, పాకిస్థాన్ నేపథ్యంలో అహ్మదాబాద్ లో శనివారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ పరిస్థితి ఏంటని క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే వర్షం పడే అవకాశం లేదని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణం పొడిగానే ఉంటుందని, వర్షం పడే అవకాశం కేవలం 1% మాత్రమే ఉందని తెలిపింది. పగటిపూట క్లౌడ్ కవర్ దాదాపు 14%, రాత్రి సమయంలో క్లౌడ్ కవర్ కేవలం 2% ఉండొచ్చని అంచనా వేసింది. కాబట్టి వాతావరణానికి సంబంధించి ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెదర్ డిపాజ్ మెంట్ భరోసాయిచ్చింది.

ముఖాముఖి పోరుకు రంగం సిద్ధం
IND Vs PAK: ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత్, పాకిస్థాన్ ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. దాయాది దేశాల క్రికెట్ సమరం కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రపంచకప్ లో ఇప్పటివరకు రెండు టీములు రెండేసి మ్యాచ్ లు ఆడి విజయాలు నమోదు చేశాయి. ఈ రోజు జరుగుతున్న ప్రతిష్టాత్మక పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. పాక్ నెగ్గాలని పాకిస్థాన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పాకిస్థాన్ పై ప్రపంచకప్ లో ఘనమైన రికార్డు ఉన్న టీమిండియాదే విజయమని ఇండియా ఫ్యాన్స్ అంటున్నారు.

 

తుది జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

ఈ విషయాలు తెలుసా?
– ఈ ఏడాది ఆడిన వన్డేల్లో పవర్‌ప్లేలో రోహిత్ శర్మ 23 సిక్సర్లు కొట్టాడు.
– పాకిస్థాన్ తమ చివరి 20 వన్డేల్లో పవర్‌ప్లే దశలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు.
– పాకిస్తాన్‌తో జరిగిన 8 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ ఒక్కసారి మాత్రమే సబ్-50 స్కోరు వద్ద ఔటయ్యాడు అది 2011లో.

తిరుపతిలో పూజలు
తిరుపతి : ఇవాళ్టి క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ గెలవాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆలయంలో అభిమానుల పూజలు నిర్వహించారు. ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టి.. భారత్ గెలుస్తుందంటూ నినాదాలు చేశారు.