WPL 2023, Gujarat vs UP Live Updates: వాటే మ్యాచ్.. గుజరాత్‌పై యూపీ థ్రిల్లింగ్ విక్టరీ, దంచికొట్టిన గ్రేస్

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది.

WPL 2023, Gujarat vs UP Live Updates: వాటే మ్యాచ్.. గుజరాత్‌పై యూపీ థ్రిల్లింగ్ విక్టరీ, దంచికొట్టిన గ్రేస్

WPL 2023, Gujarat vs Mumbai Live Updates

Updated On : March 6, 2023 / 10:55 PM IST

WPL 2023, Gujarat vs UP Live Updates: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ.. 19.5 ఓవర్లలో టార్గెట్ ను చేజ్ చేసింది. మరో బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది. యూపీ వారియర్స్ కు గుజరాత్ జెయింట్స్ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 05 Mar 2023 10:59 PM (IST)

    వాటే మ్యాచ్.. గుజరాత్‌పై యూపీ థ్రిల్లింగ్ విక్టరీ, హాఫ్ సెంచరీతో చెలరేగిన గ్రేస్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ.. 19.5 ఓవర్లలో టార్గెట్ ను చేజ్ చేసింది. మరో బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూపీ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. 26 బంతుల్లోనే 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. సింగిల్ హ్యాండ్ తో జట్టుని గెలిపించింది. ఆమె ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

  • 05 Mar 2023 10:30 PM (IST)

    7వ వికెట్ కోల్పోయిన యూపీ వారియర్స్..

    యూపీ వారియర్స్ జట్టు 16 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. 105 పరుగుల జట్టు స్కోర్ వద్ద 7 వికెట్ ను కోల్పోయింది. దేవికా వైద్య 4 పరుగులు చేసి ఔట్ అయ్యింది.

  • 05 Mar 2023 09:32 PM (IST)

    వెనువెంటనే 3 వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్స్

    యూపీ వారియర్స్ వెను వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. అలిస్సా హీలీ 7 పరుగులు చేసి కిమ్ గార్త్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగింది. ఆ వెంటనే శ్వేత 5 పరుగులకే కిమ్ గార్త్ బౌలింగ్ లోనే ఔటైంది. ఆ తర్వాత కిమ్ గార్త్ బౌలింగ్ లోనే తాహిలా (0) కూడా వెనుదిరిగింది.  ప్రస్తుతం క్రీజులో కిరణ్ నవ్గిరె (4) ఉంది.

  • 05 Mar 2023 08:58 PM (IST)

    యూపీ వారియర్స్ లక్ష్యం 170 పరుగులు

    యూపీ వారియర్స్ కు గుజరాత్ జెయింట్స్ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హర్లీన్ డియోల్ 46 పరుగులు, గార్డ్ నర్ 25 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది.

  • 05 Mar 2023 08:55 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ జెయింట్స్

    గుజరాత్ జెయింట్స్ ఆరో వికెట్ కోల్పోయింది. గార్డ్ నర్ 25 పరుగులకు ఔట్ అయిన తర్వాత హర్లీన్ డియోల్ 46 పరుగులకు ఔట్ అయింది.

  • 05 Mar 2023 08:44 PM (IST)

    5 వికెట్లు కోల్పోయిన గుజరాత్ జెయింట్స్

    గుజరాత్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయింది. సుష్మా వర్మ 9 పరుగులకు ఔట్ అయిన తర్వాత గార్డ్ నర్ 25 పరుగులకు ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో హర్లీన్ డియోల్, హేమలత ఉన్నారు. గుజరాత్ స్కోరు ప్రస్తుతం 141/5 (17 ఓవర్లకు)గా ఉంది.

  • 05 Mar 2023 08:32 PM (IST)

    గుజరాత్ స్కోరు ప్రస్తుతం 103/4

    గుజరాత్ స్కోరు ప్రస్తుతం 103/4 (14 ఓవర్లకు)గా ఉంది. ప్రస్తుతం క్రీజులో హర్లీన్ డియోల్ 23, గార్డనర్ 18 పరుగులతో ఉన్నారు.

  • 05 Mar 2023 08:25 PM (IST)

    నాలుగో వికెట్ డౌన్

    గుజరాత్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. సుష్మా వర్మ 9 పరుగులకు ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో హర్లీన్ డియోల్, గార్డ్ నర్ ఉన్నారు. స్కోరు 91/4 (13 ఓవర్లకు)గా ఉంది.

  • 05 Mar 2023 08:16 PM (IST)

    3 వికెట్లు కోల్పోయిన గుజరాత్ జెయింట్స్

    గుజరాత్ జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయింది. సోఫియా 13 పరుగులు చేసి, ఔట్ అయిన కాసేపటికే మేఘన 24 పరుగులకు, అన్నాబెల్ సదర్లాండ్ 8 పరుగులకు ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో హర్లీన్ డియోల్, సుష్మా వర్మ ఉన్నారు.

  • 05 Mar 2023 07:45 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

    గుజరాత్ జెయింట్స్ ఓపెనర్లు మొదటి ఓవర్లలో ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. మేఘన 4 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసింది. అయితే, సోఫియా 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేసి, ఔట్ అయింది. స్కోరు 34/1 (4 ఓవర్లు)గా ఉంది. 

  • 05 Mar 2023 07:41 PM (IST)

    యూపీ వారియర్స్ జట్టు

    యూపీ వారియర్స్ జట్టు: అలిస్సా హీలీ, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, దేవికా వైద్య, గ్రేస్ హారిస్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, కిరణ్ నవ్‌గిరే, అంజలి, శ్వేతా, సిమ్రాన్ షేక్.

     

  • 05 Mar 2023 07:39 PM (IST)

    గుజరాత్ జట్టు

    గుజరాత్ జట్టు: కిమ్ గార్త్, సుష్మా వర్మ, స్నేహ రానా, మాన్సీ జోషి, సబ్బినేని మేఘన, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాళాన్ హేమలత, సోఫియా డంక్లీ, తనూజ కన్వర్, హర్లీన్ డియోల్.