Ajinkya Rahane: అజింక్య రహానే అరుదైన ఘనత.. ప్రస్తుతం క్రికెట్ ఆడేవారిలో కోహ్లి ఒక్కడే
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానే టెస్టుల్లో అరుదైన ఘనతను సాధించాడు.

Ajinkya Rahane
Rahane:టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానే(Ajinkya Rahane) టెస్టుల్లో అరుదైన ఘనతను సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో వంద క్యాచ్‌లు అందుకున్న ఏడో భారత ఆటగాడిగా నిలిచాడు. లండన్‌లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా కెప్టెన్ కమిన్స్ (Pat Cummins) క్యాచ్‌ను అందుకోవడం ద్వారా రహానే రికార్డుల్లోకి ఎక్కాడు.
కాగా.. రహానేకు ఇది 83వ టెస్టు మ్యాచ్. ఈ 100 క్యాచ్‌లలో 46 క్యాచ్‌లను స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచుల్లో అందుకున్నాడు. శ్రీలంకపై 23, ఆస్ట్రేలియాపై 19, ఇంగ్లండ్‌పై 18 క్యాచ్‌లు అందుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో టీమ్ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 109 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా రహానే రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న రికార్డు రహానే పేరు మీదనే ఉంది. 2015లో శ్రీలంకలో జరిగిన గాలె టెస్టులో ఎనిమిది క్యాచ్‌లతో అందుకుని రహానే రికార్డు సృష్టించాడు.
WTC Final 2023: పట్టుబిగిస్తున్న ఆస్ట్రేలియా.. ముగిసిన రెండో రోజు ఆట.. భారమంతా రహానే పైనే
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. 163 టెస్టులు ఆడిన ద్రవిడ్ 209 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆ తరువాత శ్రీలంక ఆటగాడు మహేలా జయవర్ధనే ఉన్నాడు. అతడు 205 క్యాచ్‌లు పట్టాడు.
టెస్టుల్లో భారత్ తరఫున ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్లు వీరే..
రాహుల్ ద్రవిడ్ – 209
వివిఎస్ లక్ష్మణ్ – 135
సచిన్ టెండూల్కర్ – 115
విరాట్ కోహ్లీ- 109
సునీల్ గవాస్కర్- 108
మహ్మద్ అజారుద్దీన్-105
అజింక్య రహానే-100
Steve Smith: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీ.. పలు రికార్డులు బ్రేక్