‘గంగూలీ సపోర్ట్ చేసినట్లుగా కోహ్లీ, ధోనీ చెయ్యలేదు’

‘గంగూలీ సపోర్ట్ చేసినట్లుగా కోహ్లీ, ధోనీ చెయ్యలేదు’

Updated On : April 2, 2020 / 2:16 PM IST

టీమిండియా మాజీ ఆల్ రౌండర్.. సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్.. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ కెప్టెన్ గా తనకు సౌరవ్ గంగూలీ ఇచ్చినంత సపోర్ట్ ధోనీ, కోహ్లీలు ఇవ్వలేదన్నాడు. స్టోర్ట్‌స్టర్ అనే స్పోర్ట్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్ఞాపకాలను బయటపెట్టాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీలో కెప్టెన్సీలో ఆడిన సంగతులు బయటపెట్టాడు. తను ఆల్ రౌండర్ అవడానికి గంగూలీ సపోర్ట్ చాలా ఉందని అన్నాడు. 

‘నేను గంగూలీ కెప్టెన్సీలో చాలా గేమ్‌లు ఆడాను. అతని నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత కెప్టెన్సీని ధోనీ తీసుకున్న తర్వాత నన్ను చాయీస్ గా కూడా తీసుకోలేదు. గంగూలీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల నుంచి నాకు అలాంటిది దొరకలేదు. సౌరవ్ తో ఆడినప్పటి మ్యాచ్ లలో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి’ అని అన్నాడు. 

యువీ..  2011 వరల్డ్ కప్ మ్యాచ్ లో కీలకంగా వ్యవహరించాడు. ఆ టోర్నమెంట్ మొత్తానికి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ఆల్ రౌండర్‌ టైటిల్ దక్కించుకున్నాడు. 2019వరల్డ్ కప్ జట్టు ప్రకటించిన తర్వాత జూన్‌లో అతని రిటైర్మెంట్ ప్రకటించాడు. గంగూలీ మాత్రమే కాదు.. ధోనీ కెప్టెన్సీలో వరల్డ్ టీ20 ఆరంభోత్సవ టోర్నమెంట్ లోనూ దక్షిణాఫ్రికాపై 2007లో జరిగిన మ్యాచ్ విజృంభించిన యువీ ఇన్నింగ్స్ ఎవ్వరూ మర్చిపోలేరు. 

అందరు క్రికెటర్లలాగే యువరాజ్ ఇంట్లో ఉండి కరోనా వైరస్ లాక్ డౌన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. యువరాజ్ తో పాటు ఇతర అథ్లెట్లు,, క్రికెటర్లు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ లో పాల్గొనడంలో తమ సపోర్ట్ తెలియజేస్తున్నారు. తమ అభిమానులను ఇంట్లోనే ఉండాలని కరోనా వైరస్ సంక్షోభం నుంచి బయటపడదామని పిలుపునిస్తున్నారు. 

Also Read | మోడీ ఆసక్తికర ట్వీట్ : వీడియో సందేశంలో ఏం చెబుతారు ? సర్వత్రా ఉత్కంఠ