Your Phone Hacked : ఈ 10 సంకేతాలు కనిపిస్తే.. మీ ఫోన్ హ్యాక్ అయినట్టే.. ఎవరో ట్యాపింగ్ చేస్తున్నారు జాగ్రత్త!

Your Phone Hacked : మీ ఫోన్ హ్యాక్ అయిందా? మీ ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తున్నారని అనుమానంగా ఉందా? ఈ 10 సంకేతాలు కనిపిస్తే.. మీ ఫోన్ హ్యాక్ అయినట్టే.. ఎవరో ట్యాపింగ్ చేస్తున్నారని గమనించాలి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Your Phone Hacked : ఈ 10 సంకేతాలు కనిపిస్తే.. మీ ఫోన్ హ్యాక్ అయినట్టే.. ఎవరో ట్యాపింగ్ చేస్తున్నారు జాగ్రత్త!

10 signs your phone is hacked ( Image Source : Google )

Updated On : October 19, 2024 / 3:56 PM IST

Your Phone Hacked : మీ ఫోన్ హ్యాక్ అయిందని మీకు తెలుసా? మీకు తెలియకుండా ఎవరో మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు జాగ్రత్త.. ఇటీవల ఇలాంటి కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ల‌ను లక్ష్యంగా చేసుకుని ‘స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్‌లు’ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం తమ ఐఫోన్లను ఎవరో ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపుతోంది.

ఈ విషయమై ఇప్పటికే ఆపిల్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. మీ ఫోన్‌లలో హైడ్ అయిన కొన్ని కొత్త యాప్‌ల ద్వారా ట్యాపింగ్ జరుగుతుందని హెచ్చరించింది. ఇంతకీ, మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం అనుకుంటున్నారా? అయితే, ఈ 10 సంకేతాలు కనిపిస్తే మీ ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించి వెంటనే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

1. ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ సడన్‌గా తగ్గిపోతుందా? :
బ్యాటరీ కండిషన్ ఎలా ఉందో చెక్ చేశారా? మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గాలలో ఇదొకటి. మీ ఫోన్‌ను చాలా తరచుగా ఛార్జ్ చేస్తున్నారా? లేదా ఫోన్ బ్యాటరీ సాధారణం కన్నా వేగంగా అయిపోతుంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. కొన్ని మాల్వేర్ లేదా మోసపూరిత యాప్‌లు అధిక శక్తిని హరించే హానికరమైన కోడ్‌ని ఉపయోగించే అవకాశం ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న చాలా యాప్‌లు మీ ఫోన్ బ్యాటరీని తినేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో యాప్‌లు రన్ కావడం లేదని మీరు ముందుగా నిర్ధారించుకోవాలి.

Read Also : iPhone SE 4 Leak : ఐఫోన్ 7 ప్లస్ డిజైన్‌తో కొత్త ఐఫోన్ ఎస్ఈ 4 వస్తోంది.. లాంచ్‌కు ముందే కేస్ రెండర్లు లీక్..!

2. ఫోన్ వేగంగా వేడెక్కుతుందా? :
గేమింగ్ లేదా సినిమాలు చూసినప్పుడు సాధారణంగా ఫోన్లు వేడెక్కుతుంటాయి. అయితే, మీరు ఏమీ చేయకుండానే మీ ఫోన్ వేడెక్కుతున్నట్లయితే.. మీ ఫోన్‌ను హ్యాకర్లు కంట్రోల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

3. లింక్ చేసిన అకౌంట్లలో అన్‌నౌన్ యాక్టివిటీ :
వినియోగదారులు వారి ఫోన్‌లలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇతరుల వంటి మల్టీ అకౌంట్లను కలిగి ఉన్నారు. మీ అకౌంట్ ద్వారా మీరు చేసిన పోస్టులు కాకుండా మీకు తెలియని పోస్టులను చూసినట్లయితే జాగ్రత్త పడాల్సిందే. అంటే మీ ఫోన్ హ్యాక్ అయిందని సంకేతం కావొచ్చు. మీ ఫోన్ నుంచి ఇమెయిల్‌లను పంపడం/స్వీకరించలేకపోతే హ్యాకర్లు మీ డివైజ్ హ్యాక్ చేశారని అర్థం చేసుకోవాలి.

4. ఫోన్ ఒక్కసారిగా స్లో అయిందా? :
మీ స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా స్లో అయినట్టుగా గుర్తించారా? డివైజ్ నిదానంగా పనిచేస్తుందా? మీ ఫోన్ బ్యాటరీ పవర్ ఎక్కువగా వినియోగం అవుతుందా? అయితే, మీ ఫోన్‌లో స్టెల్త్ మాల్వేర్ ఉండవచ్చు. వెంటనే చెక్ చేసి జాగ్రత్త పడండి.

5. ఫోన్ తరచుగా క్రాష్ అవుతుందా? :
మీ ఫోన్ వర్కింగ్ వింతగా అనిపిస్తుందా? ఉదాహరణకు, యాప్‌లు తరచుగా క్రాష్ కావడం లేదా లోడ్ అవ్వడంలో ఫెయిల్ అవుతున్నాయా? యూజర్ ఇన్‌పుట్ లేకుండా సడన్ రీబూట్‌లు, షట్‌డౌన్‌లు, రీస్టార్ట్ అవుతూ ఉండవచ్చు. స్క్రీన్ లైటింగ్ మార్పులు కనిపిస్తే ఏదైనా మాల్వేర్ ఎఫెక్ట్ అయి ఉండవచ్చు.

6. ఫోన్‌లో మాల్‌వేర్ పాప్-అప్స్ :
మీకు ఫేక్ వైరస్ వార్నింగ్, ఇతర థ్రెట్ మెసేజ్ పుష్ నోటిఫికేషన్‌లు అదేపనిగా వస్తున్నాయా? మీ మొబైల్ ఫోన్‌కు యాడ్‌వేర్ ద్వారా వైరస్ సోకినట్లు సంకేతం కావచ్చు. ఇలాంటి సమయంలో పాప్ అప్స్ కనిపిస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి. యూజర్ ఇన్‌పుట్ లేకుండా పాప్ అప్స్ ఏమి చేయలేవు. అలాంటి నోటిఫికేషన్‌లు లేదా మెసేజ్‌లను అసలు ట్యాప్ చేయవద్దు.

7. మీ ఫోన్‌లో యాప్ లిస్ట్ చెక్ చేశారా? :
సాధారణంగా యూజర్లు తమ ఫోన్లలో ఏ యాప్‌లను ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటారు. మీ స్మార్ట్‌ఫోన్ యాప్ లిస్టును ఓసారి చెక్ చేయండి. మీరు అన్‌‌నౌన్ యాప్స్ గుర్తిస్తే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఎందుకంటే.. అవి స్పైవేర్ కావచ్చు. యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎల్లప్పుడూ యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేసే ముందు స్పెల్లింగ్, డెవలపర్ వివరాలు, యాప్ డిస్ర్కప్షన్ చెక్ చేయండి.

8. మొబైల్ డేటా వినియోగం పెరిగిందా? :
మీ మొబైల్ డేటా వినియోగం అకస్మాత్తుగా పెరిగిందా? సాధారణం కన్నా ఎక్కువగా ఉందో లేదో చెక్ చేయండి. హానికరమైన యాప్‌లు లేదా సాఫ్ట్‌వేర్ మీ మొబైల్ డేటాను బ్యాక్‌గ్రౌండ్‌లో వినియోగించి ఉండవచ్చు.

9. మీ గ్యాలరీలో గుర్తుతెలియని ఫొటోలు ఉన్నాయా? :
మీ ఫోన్‌ల నుంచి పాత, వాడని ఫొటోలను తొలగించడం మంచి పద్ధతి. అయితే, మీరు తీసిన ఫొటోలు, వీడియోలు మీ గ్యాలరీలో మీకు గుర్తులేకపోతే.. మీ కెమెరాపై ఎవరైనా కంట్రోల్ కలిగి ఉండవచ్చనే సంకేతం కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా, మీ ఫోన్ ఫ్లాష్‌ని అకస్మాత్తుగా ఆన్ చేసినట్లయితే.. ఎవరైనా మీ డివైజ్ రిమోట్‌గా కంట్రోల్ చేస్తున్నారని గుర్తించాలి.

10. తెలియని నంబర్ల టెక్స్ట్ లేదా కాల్ లాగ్ చెక్ చేశారా? :
మీ ఫోన్లలో గుర్తు తెలియని నంబర్ల నుంచి ఏదైనా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయా? వింత ఐకాన్లు, అక్షర కాంబోలను కలిగిన మెసేజ్‌లు లేదా మీరు చేయని కాల్‌లను కలిగి ఉన్నట్లు గమనిస్తే.. మీ ఫోన్ హ్యాక్ అయి ఉండే అవకాశం ఉంది.

Read Also : Google Messages Spam : ఆన్‌లైన్ మోసాలకు గూగుల్ మెసేజెస్ ఫీచర్‌తో చెక్ పెట్టొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?