Android Phones : తగ్గేదేలే.. ఆపిల్ ఐఫోన్ 17 కన్నా తోపు ఫీచర్లతో 7 ఆండ్రాయిడ్ ఫోన్లు.. మీ బడ్జెట్ ధరలోనే..!

Android Phones : ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలా? ఐఫోన్ 17 కొనాలా? 2026లో అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు లభ్యమవుతున్నాయి.. ఇందులో ఏ ఫోన్ కొంటే బెటర్ అనేది ఇప్పడు చూద్దాం..

Android Phones : తగ్గేదేలే.. ఆపిల్ ఐఫోన్ 17 కన్నా తోపు ఫీచర్లతో 7 ఆండ్రాయిడ్ ఫోన్లు.. మీ బడ్జెట్ ధరలోనే..!

Android Phones (Image Credit To Original Source)

Updated On : January 18, 2026 / 5:02 PM IST
  • 2026లో ఐఫోన్ 17కి పోటీగా ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌లు
  • 6.2-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ 2X 120Hz డిస్‌ప్లే
  • ఒప్పో ఫైండ్ X9, ఐక్యూ 15, రియల్‌మి జీటీ 8 ప్రో ఫోన్లు
  • మీ బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫోన్లు కొనేసుకోవచ్చు

Android Phones vs iPhone 17 : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కొనాలా? ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లను తీసుకోవాలా? ఇందులో ఏది బెటర్? చెప్పడం కష్టమే. కానీ, ప్రస్తుతం 2026లో ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌లు ఐఫోన్ 17కి గట్టి పోటీని ఇస్తున్నాయి.

టెన్సర్ జీ5 ఏఐ కెమెరాలతో గూగుల్ పిక్సెల్ 10 నుంచి కాంపాక్ట్ శాంసంగ్ గెలాక్సీ S25, పవర్-ప్యాక్డ్ వన్‌ప్లస్ 15 కెమెరా బీస్ట్ వివో X300 వరకు ఈ ఫోన్‌లు అద్భుతమైన బ్యాటరీ, సూపర్ డిస్‌ప్లేలతో మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒప్పో ఫైండ్ X9, ఐక్యూ 15, రియల్‌మి జీటీ 8 ప్రోలతో ఏదైనా కొనేసుకోవచ్చు. మీరు ఐఫోన్ 17 కొనడం కన్నా ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏదో ఒక ఫోన్ కొనేసుకోవడం బెటర్..

ఐఫోన్ 17 కన్నా ఈ ఫోన్లే ఎందుకు బెటర్ :
2026లో ఆపిల్ ఐఫోన్ 17 కొనేందుకు చూస్తున్నారా? 2026లో ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన డిస్‌ప్లేలు, చిప్‌లు, భారీ బ్యాటరీలు, హై క్వాలిటీ కెమెరాలతో లభ్యమవుతున్నాయి. గూగుల్ పిక్సెల్ ఏఐ మ్యాజిక్ నుంచి ఐక్యూ, రియల్‌మి వంటి మాన్స్టర్ పెర్ఫార్మెన్స్ ఫోన్‌ల వరకు ఐఫోన్ 17 కన్నా మెరుగైన 7 ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో మీ బడ్జెట్ ధరలోనే కొనుగోల చేయొచ్చు..

శాంసంగ్ గెలాక్సీ S25 (రూ. 66,999) :
శాంసంగ్ గెలాక్సీ S25 అనేది కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. 6.2-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ 2X 120Hz డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌పై రన్ అవుతుంది. ట్రిపుల్ 50MP కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే ఐఫోన్ 17 కన్నా ఈ శాంసంగ్ ఫోన్ తీసుకోవడమే బెటర్.

వివో X300 (రూ. 75,999) :
వివో X300లో 6.31-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ 120Hz ప్యానెల్ ఉంది. అద్భుతమైన 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందుకుంటుంది. 50MP పెరిస్కోప్ 50MP అల్ట్రావైడ్ లెన్స్‌లతో సపోర్టు ఇస్తుంది. 200MP మెయిన్ కెమెరాతో ఫొటోగ్రఫీ హైలైట్. డైమెన్సిటీ 9500 పవర్‌తో ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పొచ్చు.

గూగుల్ పిక్సెల్ 10 (రూ. 74,999) :
గూగుల్ పిక్సెల్ 10 టెన్సర్ G5 చిప్‌పై రన్ అవుతుంది. క్లీన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఏఐ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంటుంది. 48MP మెయిన్, 13MP అల్ట్రావైడ్ 10.8MP 5x టెలిఫోటోతో మల్టీఫేస్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. ఫొటోలతో డైనమిక్ రేంజ్ అందిస్తుంది. ఐఫోన్ 17 లెవల్ కెమెరా వైబ్ కావాలంటే పిక్సెల్ 10 ఆండ్రాయిడ్ బెస్ట్ ఆప్షన్.

Android Phones

Android Phones (Image Credit To Original Source)

వన్‌ప్లస్ 15 (రూ. 72,999):
వన్‌ప్లస్ 15 ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. సూపర్-ఫ్లూయిడ్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అంతేకాదు.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తుంది. 16GB ర్యామ్, భారీ 7300mAh బ్యాటరీతో పవర్ యూజర్లు, భారీ మల్టీ టాస్కింగ్, రోజువారీ పర్ఫార్మెన్స్‌తో ఐఫోన్ 17 కన్నా బెటర్ ఆప్షన్ పొందవచ్చు.

ఒప్పో ఫైండ్ X9 (రూ. 72,990) :

ఒప్పో ఫైండ్ X9 ఫోన్ డాల్బీ విజన్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ 120Hz స్క్రీన్ 3600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. డైమెన్సిటీ 9500, 16GB వరకు ర్యామ్, భారీ 7025mAh బ్యాటరీతో రోజంతా వస్తుంది. ఈ హాసెల్‌బ్లాడ్-ట్యూన్ ట్రిపుల్ 50MP కెమెరాలతో ఐఫోన్ 17 కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Read Also : Best Smart TV Deals : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ సేల్.. ఈ స్మార్ట్ టీవీ ధర కేవలం రూ. 5వేల లోపే.. స్పెషల్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు!

ఐక్యూ 15 (రూ. 72,999) :
ఐక్యూ 15 ఫోన్ అనేది పవర్ యూజర్లు, గేమర్లకు అద్భుతంగా ఉంటుంది. 144Hz ఎల్టీపీఓ, అమోల్డ్ డిస్‌ప్లే, ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 పర్ఫార్మెన్స్ 8K రికార్డింగ్‌తో ట్రిపుల్ 50MP రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. భారీ ఫ్లెక్స్ 7000mmAh బ్యాటరీతో ఐఫోన్ 17 కన్నా ఎక్కువ ఛార్జింగ్ వస్తుంది.

రియల్‌మి జీటీ 8 ప్రో (రూ. 72,999) :
రియల్‌మి జీటీ 8 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5పై రన్ అవుతుంది. డాల్బీ విజన్‌తో అద్భుతమైన 6.79-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 7000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. కెమెరా సిస్టమ్ 50MP + 200MP + 50MP సెన్సార్‌లతో వస్తుంది. జూమ్ పవర్ ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.