Airtel Users : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. ఫ్రీగా గూగుల్ వన్ స్టోరేజీ.. ఏకంగా 6 నెలలు ఎంజాయ్..!

Airtel Users : ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 6 నెలల పాటు 100GB ఫ్రీ గూగుల్ వన్ స్టోరేజ్‌ను పొందొచ్చు.

Airtel Users : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. ఫ్రీగా గూగుల్ వన్ స్టోరేజీ.. ఏకంగా 6 నెలలు ఎంజాయ్..!

Airtel Users

Updated On : May 21, 2025 / 1:25 PM IST

Airtel Users : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. సెర్చ్ దిగ్గజం గూగుల్ భారతీ ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు గూగుల్ వన్ 100GB స్టోరేజీని ఉచితంగా అందిస్తుంది.

Read Also : Split AC Offers : బాబోయ్.. ఏంటి ఎండలు.. ఈ టాప్ బ్రాండ్ ఏసీలపై దుమ్మురేపే డిస్కౌంట్లు.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

6 నెలల పాటు క్లౌడ్ స్టోరేజ్ పూర్తిగా ఉచితం. ఇకపై స్టోరేజీ విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇమెయిల్‌లను స్టోర్ చేసుకోవచ్చు.

ఎవరు అర్హులు? :
భారతీయ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ యూజర్లు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ (Wi-Fi) కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ ద్వారా యాక్టివేట్ చేయవచ్చు.

ఫ్రీగా 100GB గూగుల్ వన్ ప్లాన్‌ను రీడీమ్ చేసుకోవచ్చు. యాక్టివేషన్ తర్వాత స్టోరేజ్ గూగుల్ అకౌంటుకు లింక్ అవుతుంది. గూగుల్ డ్రైవ్, ఫోటోలు, జీమెయిల్ అన్ని ఒకేచోట యాక్సస్ చేయొచ్చు.

ఎయిర్‌టెల్ ఫ్రీ గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్.. క్లెయిమ్ ఎలా? :

  • ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ ఓపెన్ చేయాలి.
  • గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ కోసం సెర్చ్ చేయాలి.
  • ఆపై ఆప్షన్ ఎనేబుల్ చేయాలి.
  • అదనపు 100GB స్టోరేజీని పొందవచ్చు.

ఆండ్రాయిడ్, iOS యూజర్లకు :
ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ సపోర్టు చేస్తుంది. మీ 100GB క్లౌడ్ స్టోరేజీని మరో ఐదుగురితో షేర్ చేయొచ్చు. షేర్డ్ స్టోరేజ్ కోసం ప్యామిలీ లేదా చిన్న గ్రూపులో ఉన్నవారు వినియోగించుకోవచ్చు.

ఫ్రీ టైమ్ తర్వాత నెలకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. గూగుల బేసిక్ నెలవారీ ధర రూ.130 కన్నా కొంచెం తక్కువ. వద్దు అనుకుంటే.. 100GBకి యాక్సెస్ విత్‌డ్రా అవుతుంది.

కానీ, స్టోర్ చేసిన ఫైల్‌లు వెంటనే డిలీట్ కావు. డేటాను డౌన్‌లోడ్ చేయడం, ట్రాన్స్ ఫర్ చేసేందుకు గూగుల్ మల్టీ రిమైండర్‌లతో అలర్ట్ చేస్తుంది.

గూగుల్ వన్ స్టోరేజ్ (100GB) నెలకు రూ.130 చెల్లించాలి. 6 నెలల్లో రూ.780 చెల్లించాలి. ఈ ఆఫర్‌ను పొందాలంటే ఎయిర్‌టెల్ యూజర్లు మొత్తాన్ని సేవ్ చేసుకోవచ్చు.

Read Also : Vivo S30 Series : మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త వివో ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 29నే లాంచ్.. వివో ప్యాడ్ కూడా..!

ఉచితంగా స్టోరేజ్ స్పేస్ పొందొచ్చు. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ లేదా బ్రాడ్‌బ్యాండ్ యూజర్ అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి.