Apple Days Sale : ఆపిల్ డేస్ సేల్ పొడిగింపు.. ఐఫోన్ 15, మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2పై భారీ తగ్గింపులు..

Apple Days Sale : ఆపిల్ డేస్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్, మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2, ఇతర డివైజ్‌లు విజయ్ సేల్స్‌ సందర్భంగా భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి.

Apple Days Sale : ఆపిల్ డేస్ సేల్ పొడిగింపు.. ఐఫోన్ 15, మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2పై భారీ తగ్గింపులు..

Apple Days Sale extended on Vijay Sales

Updated On : January 8, 2024 / 10:21 PM IST

Apple Days Sale : విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ ఈవెంట్‌ను గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆసక్తి ఉన్న యూజర్లు తమ ఇష్టమైన డివైజ్ తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు ఈ ఈవెంట్‌ను విజయ్ సేల్స్ మరికొన్ని రోజులు పొడిగించింది. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్, మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్2, ఇతర డివైజ్‌లు విజయ్ సేల్స్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : Remove e-sim apps : భారత్‌లో ఈ 2 ఇ-సిమ్ యాప్స్ డిలీట్ చేసిన ఆపిల్, గూగుల్.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 రూ.70,990 ప్రారంభ ధరకు విక్రయిస్తోంది. ఇదే భారీ తగ్గింపు ఆఫర్. ఈ డివైజ్ వాస్తవానికి భారత మార్కెట్లో గతేడాది రూ.79,900కు ప్రకటించారు. అందువల్ల, వినియోగదారులు రూ. 8,910 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 4వేల అదనపు తగ్గింపు కూడా ఉంది. దీని ధర ప్రభావవంతంగా రూ.66,990కి తగ్గుతుంది. సరసమైన ధరలో ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. అలాగే, 128జీబీ స్టోరేజ్ మోడల్ తక్కువ ధర అని గమనించాలి.

ఐఫోన్ 15పై రూ. 9వేలు తగ్గింపు :
ఆపిల్ ఐఫోన్ 15 ప్రో కూడా భారీ తగ్గింపు ఆఫర్‌తో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ డివైజ్ తక్కువ ధర రూ. 1,25,900 వద్ద అందుబాటులో ఉంది. లాంచ్ ధర రూ. 1,35,900 నుంచి తగ్గింది. అదేవిధంగా, ఐఫోన్ 15 ప్రో మోడల్‌పై విజయ్ సేల్స్ మొత్తం రూ.9వేలు తగ్గింపును అందిస్తోంది.

Apple Days Sale extended on Vijay Sales

Apple Days Sale Vijay Sales

ఈ డీల్ ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేకుండా అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లను కలిగిన వారికి ఈ ఐఫోన్‌పై రూ.3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ప్రభావవంతంగా ధర రూ.1,22,900కి తగ్గనుంది. అదేవిధంగా, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ. 1,49,240కి అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1,59,900 కన్నా తక్కువగా ఉంటుంది.

లేటెస్ట్ ఐఫోన్ 15 సిరీస్‌లోని మ్యాక్స్ మోడల్‌పై విజయ్ సేల్స్ రూ.10,660 ఫ్లాట్ తగ్గింపును ఇస్తోంది. ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు, మ్యాక్‌బుక్స్‌లో కొన్ని డీల్స్ కూడా ఉన్నాయి. ఎం2 చిప్‌తో మ్యాక్‌బుక్ ఏఐని కొనుగోలు చేయాలనుకునే యూజర్లు మరింత సరసమైన ధరలో పొందవచ్చు. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.1,14,900 నుంచి తగ్గి రూ.1,01,960కి విక్రయిస్తున్నారు. విజయ్ సేల్స్‌పై అన్ని ఇతర డీల్‌లను కూడా చెక్ చేయవచ్చు.

Read Also : Luxury Homes Sale : దేశంలో కేవలం 3 రోజుల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైన కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్లు.. ఎగబడి కొనేస్తున్న ఎన్ఆర్ఐలు!