Apple iPhone 15 Sale : కొత్త ఐఫోన్ కొంటున్నారా? రూ.65వేల లోపు ధరకే ఐఫోన్ 15 సొంతం చేసుకోవచ్చు!

Apple iPhone 15 : ఫ్లిప్‌కార్ట్‌లో ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ A16 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది.

Apple iPhone 15 Sale : కొత్త ఐఫోన్ కొంటున్నారా? రూ.65వేల లోపు ధరకే ఐఫోన్ 15 సొంతం చేసుకోవచ్చు!

Apple iPhone 15 Sale ( Image Credit : Google )

Updated On : June 2, 2024 / 9:17 PM IST

Apple iPhone 15 Sale : ఆపిల్ గత ఏడాది సెప్టెంబర్‌లో వండర్‌లస్ట్ ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ అయిన కొద్దిసేపటికే భారత మార్కెట్లోని ఆపిల్ స్టోర్‌ల వెలుపల ఐఫోన్ల కోసం క్యూ కట్టేస్తున్నారు కస్టమర్లు.

Read Also : Vivo Watch GT Launch : 21 రోజుల బ్యాటరీ లైఫ్, ఇసిమ్ సపోర్ట్‌తో వివో జీటీ స్మార్ట్‌వాచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే

ఈ ఐఫోన్ 15 లాంచ్ సమయంలో 128జీబీ వేరియంట్ ధర రూ.79,900 కాగా, 256జీబీ వేరియంట్ రూ.89,900గా అందిస్తోంది. 512జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900కు పొందవచ్చు. ఇప్పుడు, ఐఫోన్ 15 కోరుకునే వారందరికీ ఇదే బెస్ట్ అని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ రీజన్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌పై బెస్ట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ సేల్ జూన్ 1న ప్రారంభం కాగా జూన్ 12 వరకు అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 డిస్కౌంట్ :
వనిల్లా ఐఫోన్ 15 మోడల్ 128జీబీ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నేరుగా 18 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఎలాంటి అదనపు ఆఫర్లు లేకుండా ఈ ఫోన్ రూ.64,999కి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని కలిగి ఉంటే.. మీరు ఎక్స్ఛేంజ్ చేసుకోగల పాత స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే ఈ ధరను మరింత తగ్గించవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ మెరుగైన కండిషన్‌లో ఉంటే అధిక ధరకు పొందవచ్చు.

ఐఫోన్ 15 స్పెక్స్, ఫీచర్లు :
ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అనే 5 కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఐఫోన్ 15 మోడల్ ఆపిల్ ఈసారి కూడా ఐఫోన్ 14, మునుపటి మోడల్‌ల మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంది. అయినప్పటికీ, సాధారణ నాచ్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్ నాచ్ వచ్చింది. గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడళ్లతో అప్‌గ్రేడ్ అయి వస్తుంది. ఐఫోన్ 15 ఈసారి 48ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తున్నందున కెమెరా సెక్షన్‌లో కొన్ని ప్రైమరీ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ మెరుగైన లో లైటింగ్ ఫొటోగ్రఫీ, పోర్ట్రెయిట్ షాట్‌లను కూడా అందిస్తుంది. బ్యాటరీ పరంగా.. ఐఫోన్ 15 “రోజంతా బ్యాటరీ లైఫ్”తో వస్తుందని లాంచ్ ఈవెంట్ సందర్భంగా టెక్ దిగ్గజం వెల్లడించింది. ఐఫోన్ 15 బ్యాటరీ లైఫ్ లాంచ్ సమయంలో కన్నా రెట్టింపు ఉండనుందని లేటెస్ట్ నివేదిక వెల్లడించింది. ఐఫోన్ 15 లాంచ్ సమయంలో 500 ఛార్జింగ్ సైకిల్స్‌ను తట్టుకోగలదని, ఇప్పటికీ 80 శాతం బ్యాటరీ ఆరోగ్యాన్ని కలిగి ఉంది. అయితే, ఐఫోన్ 15 మోడల్స్ వెయ్యి ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా తమ బ్యాటరీ సామర్థ్యంలో 80 శాతం నిలుపుకోగలవని ఆపిల్ తెలిపింది.

ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 15 కంపెనీ A16 బయోనిక్ చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. గత ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లలో A15 బయోనిక్ చిప్‌సెట్‌ను ఉపయోగించింది. అయితే, ప్రో మోడల్‌లు స్పీడ్, అప్‌గ్రేడ్ A16 చిప్‌ను పొందాయి. ఐఫోన్ 15 యూఎస్‌‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌కి మారే అవకాశం ఉంటుంది. ఐఫోన్ 15తో లైటనింగ్ పోర్ట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికింది. సాధారణంగా వినియోగించే యూఎస్‌బీ యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్‌ని అందిస్తోంది.

Read Also : Vivo S19 Pro Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వివో S19 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?