Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 సేల్ మళ్లీ మొదలైందోచ్.. ఈ స్టోర్లలో భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై మరోసారి సేల్ ప్రారంభమైంది. అనేక తగ్గింపు ఆఫర్లతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, విజయ్ సేల్స్, క్రోమా వంటి ప్లాట్‌ఫారమ్‌లు చాలా తక్కువ ధరకు అందిస్తున్నాయి. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై మళ్లీ సేల్ మొదలైంది. అనేక తగ్గింపు ఆఫర్లతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, విజయ్ సేల్స్, క్రోమా వంటి ప్లాట్‌ఫారమ్‌లు లేటెస్ట్ ఐఫోన్ వెర్షన్‌ను చాలా తక్కువ ధరకు అందిస్తున్నాయి. ఐఫోన్ 14కు అప్‌గ్రేడ్ వెర్షన్ సుమారు 6 నెలల క్రితమే లాంచ్ మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్త వెర్షన్ అనేక సెక్యూరిటీ అప్డేట్స్ కూడా పొందింది. ఫ్లిప్‌కార్ట్, ఇతర థర్డ్-పార్టీ ఆన్లైన్ స్టోర్ల వంటి ప్రముఖ సైట్లలో ఐఫోన్ 15 డీల్ ధరలను ఓసారి లుక్కేయండి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమాలో భారీ తగ్గింపు :
ఐఫోన్ 15 మోడల్ ధర రూ. 65,999 కన్నా తక్కువకు కొనుగోలు చేయొచ్చు. ఈ డివైజ్‌ను వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఐఫోన్ 15ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 13,901 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఐఫోన్ 15 ధర రూ. 79,900కి సొంతం చేసుకోవచ్చు.
మరోవైపు అమెజాన్ ఐఫోన్ 15ను రూ.80,990 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. కానీ, ఈ ధర 256జీబీ స్టోరేజ్ మోడల్‌కు మాత్రమే. ఫ్లిప్‌కార్ట్ డీల్ కోసం పేర్కొన్న 128జీబీ వెర్షన్ కాదు. ప్రస్తుతం 128జీబీ స్టోరేజ్ మోడల్ అమెజాన్‌లో కనిపించదు. మీరు ఐఫోన్ 15 256జీబీ మోడల్‌పై భారీ తగ్గింపును పొందవచ్చు. ఎందుకంటే.. ఈ మోడల్ అసలు ధర రూ. 89,900కు పొందవచ్చు. 256జీబీ వేరియంట్‌పై రూ. 8,910 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు.
విజయ్ సేల్స్ ద్వారా ఐఫోన్ 15ని కొనుగోలు చేయాలనుకునే యూజర్లు ఈ డివైజ్‌ను రూ. 71,155 తగ్గింపుతో పొందవచ్చు. అదేవిధంగా క్రోమా ఈ వెర్షన్‌ను రూ.71,490కి విక్రయిస్తోంది. ఈ ధరలు 128జీబీ స్టోరేజ్ మోడల్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ఆన్లైన్ సైట్లో కనిపిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్‌పై రూ. 6వేల అదనపు తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. విజయ్ సేల్స్‌పై రూ. 65,155, క్రోమాపై రూ. 65,490కి తగ్గింపు పొందవచ్చు. ఈ ధరలు ఫ్లిప్‌కార్ట్ కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ, బ్యాంక్ ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి.
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేకుండానే ఐఫోన్ 15ను అతి తక్కువ ధరకు విక్రయిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్‌ను పొందాలంటే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న వినియోగదారులు ఐఫోన్ 15ని రూ.64,999 తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్‌ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేసే వినియోగదారులు ఈ సైట్లలో ఈఎంఐ ఆఫర్లను కూడా చెక్ చేయవచ్చు. భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 128జీబీ వేరియంట్‌తో కూడిన ఐఫోన్ 15 ధర రూ. 79,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ. 89,900, 512జీబీ వేరియంట్ రూ. 1,09,900కి లభిస్తుంది.
Read Also : PM Surya Ghar Solar Scheme : ఉచిత విద్యుత్ కోసం ‘రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్’.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా?