Noida Apple Store : నోయిడాలో ఫస్ట్ ఆపిల్ స్టోర్ ప్రారంభం.. ఐఫోన్ 17, మ్యాక్‌బుక్ సహా మరెన్నో ప్రొడక్టులు.. కస్టమర్ల విజిట్ టైమ్ ఇదే..!
Noida Apple Store : నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియాలో ఈ మధ్యాహ్నం స్టోర్ ప్రారంభమైంది. స్టోర్ సిబ్బంది కస్టమర్లను చప్పట్లతో స్వాగతించారు.
Noida Apple Store
Noida Apple Store : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని DLF మాల్ ఆఫ్ ఇండియాలో మొట్టమొదటి ఆపిల్ స్టోర్ ప్రారంభమైంది. ఆపిల్ ప్రొడక్టులను ఇష్టపడే వారి కోసం ఆపిల్ ఐఫోన్ 17 సహా మ్యాక్‌బుక్ వంటి మరెన్నో ప్రొడక్టులను అందుబాటులో ఉంచింది.
డిసెంబర్ 11న ఈ స్టోర్ మధ్యాహ్నం 1 గంటలకు (Noida Apple Store) నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ స్టోర్ ఉద్యోగులు వినియోగదారులను చప్పట్లతో స్వాగతించారు. ఇది ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కంపెనీకి రెండో స్టోర్ కాగా, ఢిల్లీలోని సాకేత్‌లో ఇప్పటికే ఒక ఆపిల్ స్టోర్ ఉంది. ఈ స్టోర్ భారత్‌లో ఐదవ ఆపిల్ స్టోర్ అయితే దేశంలో ఫస్ట్ ఆపిల్ స్టోర్ ముంబైలోని BKCలో అందుబాటులో ఉంది.

Noida Apple Store
ఆపిల్ నోయిడా స్టోర్ టైమింగ్స్ ఇవే :
ఈ నోయిడా ఆపిల్ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ నుంచి మ్యాక్‌బుక్, ఐవాచ్ మోడల్స్ వరకు అన్ని లేటెస్ట్ ఆపిల్ ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయి. స్టోర్ టైమింగ్స్ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి.
ఆపిల్ స్టోర్‌లో ప్రత్యేకతలివే :
ఈ స్టోర్ ప్రారంభోత్సవంలో భారత జాతీయ పక్షి నెమలి ఈకలు ప్రముఖంగా కనిపించాయి. ఈ స్టోర్‌లో ఐఫోన్ 17 సిరీస్ వంటి లేటెస్ట్ ఐఫోన్ల కోసం ఆచరణాత్మక ప్రాంతాలు, క్రియేటివిటీ ప్రాక్టీస్ సెషన్‌లు, నిపుణులు, మేధావుల నుంచి పర్సనలైజడ్ సపోర్టు కలిగి ఉంది. బిజినెస్ కస్టమర్ల కోసం డెడికేటెడ్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. నోయిడాలో ఈ స్టోర్ ప్రారంభంతో దేశంలో ఆపిల్ రిటైల్ వ్యాపారంలో చేరింది.
కంపెనీ ఇప్పటికే ముంబైలోని బీకీసీ, ఢిల్లీ సాకేత్, పూణేలోని కోరెగావ్ పార్క్, బెంగళూరులోని హెబ్బాల్‌లో స్టోర్లను నిర్వహిస్తోంది. డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆపిల్ 8,240 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసింది. స్టోర్ లీజు వ్యవధి 11 సంవత్సరాలు. ఆపిల్ నెలవారీ అద్దెగా సుమారు రూ. 45.3 లక్షలు చెల్లిస్తుంది.. అంటే.. సంవత్సరానికి సుమారు రూ. 5.4 కోట్లు చెల్లిస్తుంది.

Noida Apple Store
లేటెస్ట్ ఆపిల్ ప్రొడక్టులు : కస్టమర్‌లు ఐఫోన్ 17 ఫ్యామిలీ, మ్యాక్‌బుక్ రేంజ్, ఎయిర్‌పాడ్‌లు వంటి కొత్త డివైజ్‌లను చూడవచ్చు. లేటెస్ట్ ఫీచర్‌లను స్వయంగా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు.
#WATCH | Noida, Uttar Pradesh: Apple opened its store in Noida’s DLF Mall of India.
This is Apple’s fifth official store in India and the second in the Delhi-NCR region. pic.twitter.com/3skAfxMaQn
— ANI (@ANI) December 11, 2025
ఎక్స్‌పర్ట్స్ సపోర్టు : ఈ స్టోర్‌లో ఎక్స్‌పర్ట్స్, క్రియేటివిటీ ఎక్స్‌పర్ట్స్, డెడికేటెడ్ బిజినెస్ టీమ్స్ సహా ప్రత్యేక సిబ్బందిని కలిగి ఉన్నారు. వారంతా టెక్నికల్ ట్రబుల్షూటింగ్ నుంచి ప్రొడక్టుల గైడెన్స్ వరకు నిపుణుల సపోర్టును అందించేందుకు రెడీగా ఉంటారు.
టుడే ఎట్ ఆపిల్ సెషన్‌లు : ఈ స్టోర్‌లో ‘టుడే ఎట్ ఆపిల్’ అనే పేరుతో ఫ్రీ, రోజువారీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఫొటోగ్రఫీ, ఆర్ట్, మ్యూజిక్, కోడింగ్ వంటి వివిధ రంగాలలో ప్రాక్టీస్, క్రియేటివిటీని ఆస్వాదించవచ్చు.

Noida Apple Store
ముంబైలో రెండో స్టోర్ ఎప్పుడంటే? :
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రెండు స్టోర్‌లను ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ముంబైలో రెండో స్టోర్‌ను ప్రారంభించనుంది. వచ్చే ఏడాది కొత్త ఆపిల్ స్టోర్ ఓపెన్ చేయనుంది. వచ్చే ఏడాది ముంబైలోని బోరివలిలోని స్కై సిటీ మాల్‌లో రెండవ స్టోర్‌ను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
