Apple Watch Series 9 : క్రోమాలో ఆపిల్ వాచ్ సిరీస్ 9పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకే పొందాలంటే?

Apple Watch Series 9 : క్రోమాలో ఆపిల్ వాచ్ సిరీస్ 9 భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ కొనుగోలుపై ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై కొన్ని తగ్గింపు ఆఫర్‌లు ఉన్నాయి.

Apple Watch Series 9 : క్రోమాలో ఆపిల్ వాచ్ సిరీస్ 9పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకే పొందాలంటే?

Apple Watch Series 9 gets big discount on Croma

Updated On : April 10, 2024 / 5:58 PM IST

Apple Watch Series 9 : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? క్రోమాలో ఆపిల్ వాచ్ సిరీస్ 9 భారీ తగ్గింపును అందిస్తోంది. అల్యూమినియం కేస్‌తో కూడిన 45ఎంఎం డిస్‌ప్లే మోడల్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 41,999 ఉండగా, గత ఏడాదిలో రూ.44,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. వినియోగదారులు ఈ ఆపిల్ వాచ్‌పై రూ.2,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Truecaller Web : ట్రూకాలర్ వెబ్‌ వెర్షన్ వచ్చేసిందోచ్.. మీ కంప్యూటర్ స్ర్కీన్ పైనే నేరుగా రియల్ టైమ్ నోటిఫికేషన్లు పొందొచ్చు!

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ. 2,500 తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. ఈ ఆపిల్ వాచ్ ధర రూ.39,499కి తగ్గుతుంది. తగ్గింపు మొత్తం రూ. 5,401కు పొందవచ్చు. ఆపిల్ వాచీలపై ఎలాంటి తగ్గింపు ఆఫర్‌లు లేవని గమనించాలి. అందువల్ల, రూ. 4వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఆపిల్ వాచ్ డీల్ ఎప్పుడు ముగుస్తుందో ప్రస్తుతానికి తెలియదు.

ఆపిల్ వాచ్ సిరీస్ 9 స్మార్ట్‌వాచ్ S9 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ఈ సీపీయూ 5.6 బిలియన్ ట్రాన్సిస్టర్‌లతో వస్తుంది. ఆపిల్ సిరీస్ 9 రెండో జనరేషన్ అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్‌తో వస్తుంది. లొకేషన్-ఆధారిత ఫీచర్‌ల కచ్చితత్వాన్ని అందిస్తుంది. మీ వాచ్‌ని కోల్పోకుండా ఉండేలా ఈ ఫీచర్ ప్రొటెక్ట్ చేస్తుంది.

డబుల్ ట్యాప్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
ఇందులోని చిప్ ఆపిల్ వాచ్ సిరీస్ 9 యూజర్లను తమ హోమ్‌పాడ్‌లో సింపుల్ ట్యాప్‌తో మ్యూజిక్ ప్లేబ్యాక్‌ని కంట్రోల్ చేయొచ్చు. స్మార్ట్‌వాచ్‌లో దీర్ఘచతురస్ర భారీ డిస్‌ప్లే ఉంది. 2,000నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. గత వెర్షన్ వాచ్ సిరీస్ 8 కన్నా రెట్టింపుగా ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 9 కూడా డబుల్-ట్యాప్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫంక్షన్ యూజర్లు తమ చూపుడు వేలు, బొటనవేలును కలిపి నొక్కడం ద్వారా ఫోన్ కాల్‌లకు ఆన్సర్ చేయొచ్చు.

ఆపిల్ విజన్ ప్రోతో ప్రదర్శించే ట్యాపింగ్ ఫీచర్‌ను గుర్తుకు తెస్తుంది. డబుల్-ట్యాప్ ఫీచర్ వచ్చే నెల నుంచి యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. గరిష్టంగా 18 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది.

ఈ ఫోన్ కొనుగోలుపై ఎలాంటి బ్యాంక్ కార్డ్‌లు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు లేకుండా కేవలం రూ. 65,999 వద్ద అందిస్తోంది. రిటైల్ ధర ప్రకారం చూస్తే.. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. గత ఏడాది భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 15 రూ.79,900కు విక్రయించింది.

Read Also : Google Find My Device : ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ‘ఫైండ్ మై డివైజ్’ నెట్‌వర్క్.. పిక్సెల్ 8 ఫోన్లు ఆఫ్‌‌లో ఉన్నా ఈజీగా ట్రాక్ చేయొచ్చు!