Apple iPhone 15 Sale : ఐఫోన్ 15 సేల్ మొదలైందోచ్.. ఆపిల్ స్టోర్ల వద్ద అభిమానుల సందడి.. కొత్త ఐఫోన్లు ఎగబడి కొనేస్తున్నారు..!

Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో సెప్టెంబర్ 22న అమ్మకానికి వచ్చేసింది. భారత మార్కెట్లో ఆపిల్ స్టోర్ల వెలుపల మొట్టమొదటిసారిగా ఆపిల్ అభిమానులు ఐఫోన్ కొనేందుకు భారీగా క్యూ కట్టారు.

Apple iPhone 15 Sale : ఐఫోన్ 15 సేల్ మొదలైందోచ్.. ఆపిల్ స్టోర్ల వద్ద అభిమానుల సందడి.. కొత్త ఐఫోన్లు ఎగబడి కొనేస్తున్నారు..!

As iPhone 15 goes on sale, people queue up and wait for hours outside 2 Apple stores in India

Apple iPhone 15 Sale : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఈరోజు (సెప్టెంబర్ 22)న సేల్ మొదలైంది. iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Maxతో సహా iPhone 15 సిరీస్ అధికారికంగా భారత మార్కెట్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. న్యూఢిల్లీలోని ఆపిల్ సాకేత్ స్టోర్‌, ముంబైలోని ఆపిల్ BKC స్టోర్ వద్ద అభిమానులు రూ. 3 లక్షలతో ఐఫోన్ కొనుగోలు చేశారు. లేటెస్ట్ ఆపిల్ డివైజ్‌లను కొనుగోలు చేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు.

ఎందుకంటే.. దేశంలోని అధికారిక ఆపిల్ స్టోర్ల ద్వారా కొత్త ఐఫోన్, వాచ్ మోడల్స్ విక్రయించడం ఇదే మొదటిసారి. గత వేసవిలో ముందుగా, ఆపిల్ భారత్‌లో 2 అధికారిక స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ముంబైలో Apple BKC, రెండో స్టోర్ ఢిల్లీలోని (Apple Saket)లో ఉంది. ఏప్రిల్‌లో ఈ రెండు స్టోర్లను కంపెనీ సీఈఓ టిమ్ కుక్, భారతీయ యూజర్ల కోసం ప్రత్యేకించి ఆపిల్ స్టోర్‌లను ప్రారంభించాడు.

ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ సేల్ .. :
ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ సేల్ సందర్భంగా ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ సాకేత్ వద్ద గట్టి భద్రత మధ్య అభిమానులు పెద్ద వరుసలలో క్యూలో ఉన్నారు. స్టోర్ తలుపులు సరిగ్గా ఉదయం 8 గంటలకు తెరవగానే.. ఆపిల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు మాల్, చప్పట్లతో కస్టమర్లను స్వాగతించారు. అయితే, స్టోర్ వెలుపల ప్రీ-ఆర్డర్ కస్టమర్ల కోసం ప్రత్యేక క్యూ కూడా ఉంది. అయితే, మాల్‌లోని ప్రత్యేక ప్రాంతాలలో అధిక రద్దీని నివారించడానికి ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Read Also : Apple iPhone 15 Offers : ఆపిల్ ఐఫోన్ 15 కొనేందుకు చూస్తున్నారా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

గుర్గావ్‌కు చెందిన రాహుల్, వివేక్ అనే ఇద్దరు సోదరులు తమ ప్రీ-బుక్ చేసిన iPhone 15 Pro, iPhone 15 Pro Maxని పొందిన మొదటి, రెండో కస్టమర్లుగా నిలిచారు. కాంపాక్ట్ ఐఫోన్ 15 ప్రో కాంపాక్ట్, ఫీచర్-లోడ్ చేసిన కొనుగోలుకు సమంజసమని వివేక్ భావించారు.

అతని సోదరుడు, రాహుల్ కూడా iPhone 15 Pro Max 1TB వెర్షన్‌ను కొనుగోలు చేశాడు. నేచురల్ టైటానియం కలర్ వేరియంట్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. న్యూఢిల్లీకి చెందిన మరో కొనుగోలుదారుడు సరికొత్త iPhone 15 Pro Max, Apple Watch Ultra 2ని కొనుగోలు చేశాడు. దాదాపు రూ. 2.9 లక్షల మొత్తం బిల్లును చెల్లించాడు.

As iPhone 15 goes on sale, people queue up and wait for hours outside 2 Apple stores in India

Apple iPhone 15 Sale goes on sale, people queue up and wait for hours outside 2 Apple stores in India

భారత్‌, విదేశాలలో ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది. దేశ మార్కెట్లో ప్రామాణిక ఐఫోన్ 15 మోడల్‌లు తయారవుతున్నాయి. ఆపిల్, ప్రభుత్వం సాయంతో ప్రో ఐఫోన్ మోడల్స్ కూడా స్థానికంగా తయారు చేస్తోంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌ మోడల్స్ భారత మార్కెట్లోనే తయారయ్యాయి. అయినప్పటికీ, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లకు తక్కువ ధర ఉండగా.. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రోల ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంది.

ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ కొనుగోలు చేయడానికి వచ్చిన కొనుగోలుదారుల్లో ఇద్దరు మాత్రమే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లను కొనుగోలు చేశారు. వివేక్ అనే ఒక కస్టమర్ మాత్రమే ఐఫోన్ 15 ప్రోని సొంతం చేసుకోన్నాడు. కానీ, మిగిలిన వారందరూ iPhone 15 Pro Max ప్రీ-బుకింగ్ లేదా ఆన్-స్పాట్ బుకింగ్ చేసుకున్నారు. ఈ ఐఫోన్ మోడల్ చాలా ఖరీదైనది అయినప్పటికీ, ఆపిల్ అభిమానులలో క్రేజ్ ఎక్కువగా ఉంది.

ఆపిల్ సెప్టెంబర్ 12, 2023న వండర్లస్ట్ ఈవెంట్ సందర్భంగా iPhone 15 సిరీస్, Apple Watch Series 9, Apple Watch Ultra 2లను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర పరంగా, iPhone 15 ధర రూ. 79,900తో అందుబాటులో ఉంది. iPhone 15 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, ఐఫోన్ 15 ప్రో ప్రారంభ ధర రూ. 1,34,900, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,59,900కు సొంతం చేసుకోవచ్చు.

Read Also :  iPhone 15 Sale: ఐఫోన్ 15 అమ్మకాల జాతర.. ముంబై Apple స్టోర్ వెలుపల క్యూ కట్టిన కస్టమర్స్